విశాఖలో ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం ప్రవేశపెట్ట బోతోంది. కేంద్ర ప్రభుత్వ ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)సహకారంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులకు ఈ వాహనాలను సమకూర్చనున్నారు.

ప్రస్తుతం జిల్లాలో 230 అద్దె వాహనాలు ప్రభుత్వ శాఖల్లో వినియోగంలో ఉన్నాయి. ఇప్పడు వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నారు. వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ కూడా ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేయనుంది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని నగరాలకు ఈఈఎస్ఎల్ ఈ వాహనాలను సమకూరు స్తోంది. విశాఖను ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

ఈఈఎస్ఎల్ సంస్థ నుంచి ఈ వాహనాలను సమకూర్చే కాంట్రాక్ట్ టాటా మోటార్స్ సంస్థ దక్కించుకుంది. 500 వాహనాలను నవంబర్లో ఈఈఎస్ఎల్ కి టాటా మోటార్స్ అందించనుంది.

ఈ కార్లు విశాఖ నగరానికి డిసెంబర్, జనవరిల్లో వచ్చే అవకాశముందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఈఈఎస్ఎల్ సంస్థే అందజేస్తుంది.

ఒక్కో కారు ధర రూ.11.20లక్షల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. అయిదేళ్ళ వారంటీతో ఈ కార్లను టాటా మోటార్స్ సరఫరా చేయనుంది.

Advertisements