పోలవరం పనులు అద్భుతంగా జరుగుతున్నాయని, కాని భూనిర్వాసితులకు న్యాయం చేయాలని పదవీ విరమణ చేసిన సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ అభిప్రాయడ్డారు. శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు పై సంతృప్తి వ్యక్తం చేశారు. దీన్నొక అద్బు తంగా ఆయన అభివర్ణించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగిస్తున్నారన్నారు. సాధారణంగా ఏ ప్రాజెక్టులోనూ డయాఫ్రమ్‌వాల్‌ కనిపించదన్నారు. ఇదో కొత్త కాన్సెప్ట్‌గా పేర్కొన్నారు. సహజంగా డ్యామ్‌, స్పిల్‌వేలు ఒకటిగానే కనిపిస్తాయి. పోలవరం ఇవి వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఇది పూర్తయితే రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందన్నారు.

lakshminarayana 23062018 2

శ్రీశైలం ప్రాజెక్ట్‌తో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలున్నాయన్నారు. కొండల మధ్య నదీప్రవాహానికి అడ్డుకట్టేసి శ్రీశైలం ఆనకట్ట నిర్మించారన్నారు. కానీ ఇక్కడ సమాంతరంగా పారుతున్న గోదావరి ప్రవాహ దిశను మార్చి కుడి, ఎడమ కాలువల్లోకి నీరు మళ్ళిస్తారన్నారు. పోలవరం పురోగతి పై పత్రికల్లో వస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తించాయన్నారు. ఇదెప్పుడు పూర్తవుతుందా అన్న ఉత్కంఠ రైతుతో పాటు తనలోనూ ఉందన్నారు. దీని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేంద్రం త్వరగా విడుదల చేయాలన్నారు. అలాగే భూసేకరణ నష్టపరి హారంలో తేడాల్ని సవరించాలన్నారు. 2013 చట్టానికనుగుణంగా చెల్లింపులు జరపాలన్నారు. జిఓలన్నింటిని పారదర్శకంగా అమలు చేయాలన్నారు.

lakshminarayana 23062018 3

కాఫర్‌డ్యామ్‌ ఎత్తును 31నుంచి 41మీటర్లకు పెంచడం కూడా మంచిందే అన్నారు. దీని వల్ల డ్యామ్‌ పూర్తికాక ముందే గ్రావిటీ ద్వారా సాగు నీరివ్వొచ్చన్నారు. కుడి ప్రధాన కాలువ పనులు 98శాతం పూర్తయ్యాయన్నారు. ప్రధాన ప్రాజెక్ట్‌ పనులు 55 శాతం పైగా జరిగాయన్నారు. లక్ష్మీనారాయణకు పోలవరం ఇంజనీర్లు రమేష్‌బాబు, బాలకృష్ణలు స్వయంగా ప్రాజెక్ట్‌ పనుల వివరాల్ని వివరించారు. వాటిని ఆయన ఆసక్తిగా విన్నా రు. పలు సందేహాల్ని అడిగి నివృతి చేసుకున్నారు. పట్టిసీమ ద్వారా నీరిస్తుండగా భారీ వ్యయంతో కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంచి గ్రావిటీ ద్వారా నీరందించాల్సిన అవసరమేంటంటూ ఆయన ఇంజనీర్లను ప్రశ్నించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిమాణంలో నీటినిచ్చేందుకంటూ అధికారులు ఆయనకు వివరించారు.

Advertisements