మొన్నటి దాకా రాష్ట్రంలో ఏ నేరాలు జరిగినా, వాటికి నేర నిర్థారణ చేసి దొంగలకి, కేడీ గాళ్ళకి శిక్ష పడాలి అంటే, హైదరాబాద్ లోని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపించి, వారిచ్చే రిపోర్ట్ కోసం, ఎదురు చూస్తూ ఉండేవారు మన పోలీసులు... అయితే ఇప్పుడు త్వరలోనే ఈ బాధ తీరనుంది... నేర నిర్థారణ కోసం, ఇక నుంచి హైదరాబాద్ లోని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ కు పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన అమరావతిలోనే స్టేట్‌ లెవెల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ ఏర్పాటు కానున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదించింది.. ఆమోదించటమే కాదు, శంకుస్థాపన ముహూర్తం కూడా రెడీ అయ్యింది...

forensic 26122017 2

రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు గ్రామానికి నైరుతి వైపున స్టేట్‌ లెవెల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ ఏర్పాటు కానున్నది. ఈ నెల 28 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. స్టేట్‌ లెవెల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ కి మూడు ఎకరాలను సీఆర్‌డీఏ కేటాయించింది. అలాగే ప్రతి జిల్లలో ఒక రీజనల్‌ సైన్స్‌ ల్యాబరేటరీ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రానికి సంభందించి స్టేట్‌ లెవల్‌ లాబ్‌రేటరీ ప్రస్తుతం హైద్రాబాద్‌ ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా, మన పోలీసులు హైదరాబాద్ లోని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ మీద ఆడరపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా తీవ్రమైన కాలయాపన చోటుచేసుకోవడం, కేసు విచారణ సమయంలో అవసరమైన ఆధారాలను సమర్పించ లేకపోవడంతో నిందితులు తప్పించుకుంటున్నారు.

forensic 26122017 3

రాజధాని అమరావతిలో స్టేట్‌ లెవల్‌ ల్యాబ్‌ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించటంతో, ఇక ఈ కష్టాలు తీరనున్నాయి. నేరపరిశోధనలో ఈ సైన్స్‌ ల్యాబరేటరీ నివేదికలే కీలకం. డీఎన్‌ఏ టెస్ట్‌లు కూడా ఈ ల్యాబ్‌లో జరుగుతాయి. తుళ్లూరు పరిసరాలలో ఏదో ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రి కోరామని, రాజధానిలో అంతటి ప్రతిష్ఠాత్మకమైన ల్యాబ్‌ ఏర్పాటు కాబోతుండటం సంతోషంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. అలాగే పోలీసు డిపార్టుమెంటు కూడా, ఈ ల్యాబ్ తొందరగా పూర్తయితే, హైదరాబాద్ మీద ఆదారపడకుండా, త్వరతిగతిన నేరాలు రుజువు చేసే అవకాసం ఉంటుంది అని అంటున్నారు.

Advertisements