ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా అమరావతిలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ పోలీసు విభాగాన్ని ఆధునికీకరించేందుకు కేంద్రం సిద్ధమైంది.

ఇందులో భాగంగా పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు రూ.25,060 కోట్లు కేటాయించనున్నట్లు కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు.

Advertisements