ఇన్ని రోజులు అనుకుంటున్నట్టు, 100 కోట్లు కాదు, ఎమ్మల్యేకు 150 కోట్లు.. ఒక్కో ఎమ్మల్యేకు 150 కోట్లు.. ప్రజా స్వామ్య చరిత్రంలో ఒక మైనింగ్ మాఫియా డాన్ చేస్తున్న అరాచకాలు ఇవి.. సహజ సంపద కొల్ల గొట్టిన ఒక దొంగని ప్రధాని స్థాయి వ్యక్తి నెత్తిన ఎక్కించుకుంటే జరిగే పరిణామాలు ఇవి... ఒక్కో ఎమ్మల్యేకు 150 కోట్లు.. వామ్మో వాయ్యో, అనుకుంటం తప్ప, మనం ఏమి చెయ్యలేము.. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలో బీజేపీ బండారం బట్టబయలైంది. శనివారం 4 గంటలకు అసెంబ్లీలో సీఎం యడ్యూరప్పకు విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేతలు వల వేస్తున్నారు.

gali 18052019

ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్నగౌడతో గాలి జనార్దన్‌ రెడ్డి బేరసారాలు జరిపారు. దీనికి సంబంధించి ఆడియో టేప్ లీక్ అవడం కన్నడ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలతో జనార్దన్‌రెడ్డి మాట్లాడిన ఆడియోను కాంగ్రెస్‌నేత ఉగ్రప్ప శుక్రవారం విడుదల చేశారు. ఆడియో టేపులో రాయచూర్‌ రూరల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసన్నగౌడతో గాలి బేరమాడారు. యాడ్యూరప్పకు మద్దతిస్తే లైఫ్‌ సెటిల్‌ చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి స్పందించిన బసవన్న గౌడ.. ‘‘మీపై నాకు గౌరవం ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి నమ్మక ద్రోహం చేయలేను’’ అని బదులిచ్చారు.

gali 18052019

బీజేపీ అధిష్ఠానం సూచనతో మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చే బాధ్యతను బళ్లారి బీజేపీ నేత గాలి జనార్దన రెడ్డి ఆయన సోదరులతో పాటు స్నేహితుడు బి.శ్రీరాములు స్వీకరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోగా మెజార్టీకి అవసరమైన కాం గ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల మద్దతును కూడ గట్టాలని వీరిద్దరికీ సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఈ వాదనను బలపరిచేలా గాలి జనార్దన రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సుభాష్‌ ఐకార్‌ రంగంలోకి దిగారు. గౌరిబిదనూరు ఎమ్మెల్యే శివశంకర్‌ రెడ్డిని, పావగడ ఎమ్మెల్యే వెంకటరమణప్పను ఫోన్‌లో సంప్రదించారు. బీజేపీకి సహకరిస్తే మంత్రి పదవితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 

Advertisements