ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయంలో ఈరోజు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గన్నవరం విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నామనీ, ఫ్లైట్ ను పాకిస్తాన్ కు తరలిస్తామని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి అధికారులను హెచ్చరించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు హైఅలర్ట్ ను ప్రకటించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో అదనపు బలగాలను మోహరించిన అధికారులు, లగేజ్, ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలకు అనుమతిస్తున్నారు. కాగా, ఈ ఫోన్ కాల్ ఆకతాయి పని అయ్యుండొచ్చనీ, అయినా ఛాన్స్ తీసుకోలేమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

gannavaram 240222019

పుల్వామా దాడి జరిగి పదిరోజులైనా కాకముందే , ఇలాంటి హెచ్చరికులు దేశమంతా వస్తున్నాయి. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి పాకిస్థాన్‌కు తీసుకుపోబోతున్నామంటూ ముంబైలోని ఎయిరిండియా కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చిన ఫోన్‌కాల్‌తో బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) అప్రమత్తమైంది. భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలుచేయాలంటూ దేశంలోని అన్ని విమానాశ్రయాలకూ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని విమానాశ్రయాల భద్రతా విభాగాలు, విమానయాన సంస్థలు తప్పనిసరిగా, తక్షణమే పాటించాల్సిన ఎనిమిది భద్రతా చర్యలతో ఒక నోట్‌ విడుదల చేసింది.

gannavaram 240222019

అంతేకాదు, గల్ఫ్‌ దేశాలకు, పాకిస్థాన్‌కు వెళ్లే విమానాలకు సంబంధించి సెకండరీ లాడర్‌పాయింట్‌ చెకింగ్‌కు (ఎస్‌ఎల్‌పీసీ.. అంటే అన్ని చెకింగ్‌లూ ముగించుకుని వచ్చిన ప్రయాణికులను విమానం ఎక్కే సమయంలో మరోసారి తనిఖీ చేయడం) ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ప్రయాణికులు నిర్ణీత సమయానికన్నా ముందుగా రావాలని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎ్‌సఎ్‌ఫ)కు చెందిన ఒక ఉన్నతాధికారి విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ రాకపోకలపై కఠిన నియంత్రణలు విధించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Advertisements