ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలకు ఒక ప్లకార్డు చూపించి నిరసన తెలిపితేనే చితకబాదుతున్నారు, బీజేపీ నేతలు. అయితే, ఈ బీజేపీ నేతలకు మాత్రం, ఎక్కడకు వెళ్ళిన నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. సాక్షాత్తు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కి, ఒక స్టేట్ స్టేట్ అంతా నిరసన తెలుపుతుంది. మరి ఇక్కడ పడేసి బాదుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు, ఇప్పుడు అమిత్ షా పై నిరసన తెలిపిన వారందరినీ పడేసి బాదుతారా ? ఇక విషయానికి వస్తే, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు తమిళనాడులో పర్యటన ఒక రోజు పర్యటన చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలతో భేటీ అయ్యేందుకు అమిత్‌ షా సోమవారం చెన్నైలో పర్యటించారు. అయితే, చెన్నై వెళ్ళిన అమిత్ షా కు, చుక్కలు చూపిస్తున్నారు తమిళ తంబీలు...

amit 10072018 2

ఒక్కరోజు పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడుకి ‘#getlostamitshah’ అంటూ తమిళ ప్రజలు ట్విటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఇదే టాగ్‌తో అతి తక్కువ సమయంలో 75 వేల ట్వీట్లు షేర్‌ చేయడంతో ట్రెండింగ్‌గా మారింది. అమిత్‌ షా పర్యటనను నిరశిస్తూ తమిళనాడు ప్రముఖ పారిశ్రమికవేత్త సీకే కూమరవేల్‌ ఈ విధంగా ట్వీట్‌ చేశారు. ‘తమిళ ప్రజలను దేశం పిచ్చివాళ్లగా, ఉగ్రవాదులు చూస్తోంది. ఇతరులను గౌరవించడం మాకు బాగా తెలుసు. మేము టుటీకోరిన్‌ ఉప్పును తింటాము. మీరు కూడా అది తినండి. ఇతరులను ఎలా గౌరవించాలో తెలుస్తుంది’ అని ట్వీట్‌ చేశారు.

amit 10072018 3

మతపరంగా దేశాన్ని విడదీయాలని చూసే అమిత్‌ షా, నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులను ఇక్కడ చోటు లేదంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. పిల్లలు, మహిళలు, దళితులకు హానీ చేసే వాళ్లను తమిళనాడు రానివ్వం అని ఓ యువకుడు ట్వీట్‌ చేశాడు. మాజీ సీఎం జయలలిత చనిపోయిన తరువాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన అమిత్‌ షా, నరేంద్ర మోదీలు చెన్నై రావడానికి వీళ్లేదని సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గత ఏప్రిల్‌లో తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆయన హెలికాప్టర్ లో వెళ్ళినా, నల్ల బలూన్లు పైకి ఎగరేసి మరీ నిరసన తెలిపారు. బీజేపీ పై ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా, ఎక్కడకు వెళ్ళినా వీరికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది.

Advertisements