మనం రొజూ ఎన్నో రాజకీయ ఛాలెంజ్ లు చూస్తూ ఉంటాం... నిన్న కాక మొన్న నంద్యాలలో చూసాం, శిల్పా అయితే ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నారు... జగన్ అయితే కాల్చేస్తా అన్నారు... రోజా అయితే అప్ అండ్ డౌన్ అదరాలి అంది.. చివరకి ఇలాంటి మాటల వల్ల ఏమైందో చూసాం... ముఖ్యంగా ప్రజలకు, రవ్వంత అయినా ఉపయోగం ఉండదు... పేపర్లో న్యూస్ ఐటెం కి, టీవీ లో బైట్ కి, ఫేస్బుక్ లో స్టేటస్ కి మాత్రమే ఇలాంటివి ఉపయోగపడతాయి..

ఇలాంటి రాజకీయ ఛాలెంజ్ లో నుంచే ఈ మధ్య కొన్ని ఛాలెంజ్స్ వస్తున్నాయి.... ఇవి ప్రజలకు ఉపయోగపడే ఛాలెంజ్... మొన్నా మధ్య పులివెందులలో నీళ్లు పారితేగానీ గడ్డం తీయనన్నారు. అన్నట్లుగానే ఆనాటి నుంచి మొన్నటి వరకు ఆయన గడ్డం తీసుకోలేదు... ఆయన చెప్పినట్టుగా పులివెందులకు నీళ్ళు తీసుకెళ్ళి, గడ్డం తీయించుకుని దీక్ష విరమించనున్నారు...

ఇప్పుడు అలాంటే ఛాలెంజ్ ఇంకోటి నెరవేరబోతుంది... శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ తాను చేపట్టిన గెడ్డం దీక్షను శనివారంతో ముగించనున్నారు. జిల్లాలో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు నిధులు మంజూరు కోసం ఆయన తన అనుచరులతో కలసి ఏప్రిల్‌1న దీక్ష మొదలుపెట్టారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతోపాటు రూ.466కోట్లు మంజూరు చేయడంతో దీక్షను విరమిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. శుక్రవారం తిరుపతి వెళ్లి శనివారం గెడ్డం తీసివేస్తానని శివాజీ పేర్కొన్నారు.

రాజకీయాల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ఉండే ఛాలెంజ్ లు ఉంటే, అటు ప్రజలకీ లాభం ఉంటుంది, మంచి పనులు చేస్తున్నారు అనే ఇమేజ్ రాజకీయ నాయకులకి వస్తుంది... ఉత్తమ కుమార ప్రగల్భాలు పలకటం కాదు, ఇలా పనులు చేసి ప్రజల మనసులు దోచుకోవాలి..

Advertisements