విజయవాడలోని  పాత గవర్నమెంట్ హాస్పిటల్ లో  దారుణమైన సంఘటన జరిగింది. ప్రసవ నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన ఒక నిండు గర్భిణీని కనీసమైనా పట్టించుకోకుండా వదిలేయడంతో ఆ మహిళ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. వారి బందువులు పడుకోపెట్టటానికి  స్ట్రెచర్ కోసం అడిగినా కూడా ఇవ్వలేదని వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళ్ళా,వేళ్ళా  పడినా కూడ  కనీస కనికరం కూడా చూపలేదని వారి బందువులు ఆరోపిస్తున్నారు.  అదేమని అడిగితే , మా దగ్గర రూల్స్ మాట్లాడుతారా  అంటూ ఆగ్రహం వ్యక్తంచేసారని  బంధువులు చెబుతున్నారు. ఎంతకీ హాస్పిటల్ సిబ్బంది సహకరించ పోవడంతో  నేలపైనే ఆ గర్భిణీని  పడుకోబెట్టి ప్రసవం చేసారు. ప్రసవం తరువాత  ఆ మహిళ తీవ్ర వాంతులు అయ్యాయి. ఆ వాంతులు చేసుకునే సమయంలో కడుపులోని శిశువు జారి కిందకు పడటంతో  ఆ బిడ్డ  తల నేలకు తగిలి బొడ్డు తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇప్పుడు ఆ తల్లి బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వారి కుటుంబ సభ్యులు చేబుతున్నారు.

Advertisements