గవర్నర్‌ నరసింహన్‌ పై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. అటు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీజేపీ ఎమ్మల్యే విష్ణు కుమార్ రాజు, ఈ గవర్నర్ మాకు వద్దు అంటూ దండం పెడుతున్నారు... గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణా పక్షపాతి అని, కెసిఆర్ ఏమి చెప్తే అది వింటారు అనే ప్రచారం ఉంది... తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన నాలా బిల్, గవర్నర్ తిప్పి పంపారు... నాలా అంటే, అగ్రికల్చర్‌ టు నాన్‌ అగ్రికల్చర్‌ కన్వర్షన్‌... వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మళ్లించే చట్టం... పరిశ్రమలకు భూములు అవసరం అయిన నేపధ్యంలో ఈ బిల్ చాలా అవసరం... ఈ భూమి మార్పిడి ఫీజు తగ్గింపు, ఇతర కీలక సవరణలపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లు పై రాజముద్ర వేసేందుకు గవర్నర్‌ నిరాకరించారు. తిప్పి పంపిస్తూ, క్లారిటీ కావలి అని చంద్రబాబుకి లెటర్ రాసారు..

govermer 11012018 2

గతంలో ఇదే అంశంపై సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కూడా గవర్నర్‌ ఆమోదించలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపైనా పాత అభ్యంతరాలే లేవనెత్తి... తిరుగుటపాలో పంపించారు. అయితే గవర్నర్‌ కు రూల్స్‌లోనే అన్నీ చెబుతామంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... గవర్నర్‌ అభ్యంతరాలపై వెంటనే వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి రెవెన్యూశాఖను ఆదేశించారు... గత ఏడాది జూన్‌లో ఆర్డినెన్స్‌ తయారు చేసి గవర్నర్‌ ఆమోదం కోసం పంపించారు. ఆర్డినెన్స్‌లోని అంశాలు అసంబద్ధంగా, అస్పష్టంగా ఉన్నాయంటూ గవర్నర్‌ అనేక అభ్యంతరాలను లేవనెత్తారు... ర్డినెన్స్‌ను ఆమోదించలేదు..

govermer 11012018 3

ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ భూమి చట్టం-2016 సవరణ బిల్లును ఆమోదించింది. ఆర్డినెన్స్‌లో పొందుపరిచిన అంశాలే ఈ బిల్లులోనూ ఉన్నాయి. ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన తర్వాత... డిసెంబర్‌ మొదటి వారంలో గవర్నర్‌ ఆమోదం కోసం పంపించారు. దీనినీ గవర్నర్‌ తిప్పిపంపించారు. అయితే ఇదే రకమైన తెలంగాణా బిల్ గవర్నర్ ఆమోదించారు అని, ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి, ఈ వివక్ష మంచిది కాదు అని విష్ణు కుమార్ రాజు అంటున్నారు... మరి ఇప్పుడు ప్రభుత్వం పంపించే వివరణతో గవర్నర్ ఏకీభవిస్తారో, లేక అడ్డు పుల్ల వేస్తారో చూడాలి...

Advertisements