ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ తెలంగాణా పక్షాపాతిగా వ్యవహరిస్తారు అనే పేరు ఉంది... అయితే తెలంగాణాలో కూడా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ పై ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర ఆరోపనులు చేసింది... నువ్వు అసలు గవర్నర్ వేనా అని ప్రశ్నించింది... అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొద్ది రోజులుగా ధిక్కార స్వరం వినిపించింది... తెలంగాణా ప్రభుత్వానికి పక్షపాతిగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా అన్యాయం చేస్తున్నారో, సాక్షాత్తు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ పై పోరాటం చేస్తున్నారు... తాజాగా మరోసారి విష్ణుకుమార్ రాజు గవర్నర్ పై ఫైర్ అయ్యారు...

governer 10012018 2

ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను తొల‌గించి, బ‌డ్జెట్ స‌మావేశాల్లోగా కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు... దీని కోసం ఢిల్లీలో కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు... ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో ఆయ‌న మాట్లాడుతూ... గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఏపీ బాగోగుల‌ను ప‌ట్టించుకోలేదని మండిప‌డ్డారు. చుట్ట‌పుచూపుగా రాష్ట్రానికి వ‌చ్చి వెళుతున్నార‌ని, గ‌వ‌ర్న‌ర్ వ‌ల్ల ఏపీకి ప్ర‌యోజనం లేదని చెప్పారు. రాష్ట్రంలో నివాసానికి అనువైన వ‌స‌తులు లేవ‌ని రాలేక‌పోతున్నారా? అని ఎద్దేవా చేశారు. గవర్నర్ ఏ రోజైనా కుటుంబ పెద్దలా వ్యవహరించారా? క‌నీసం వారం రోజులైనా ఏపీలో ఉన్నారా? అని ఆయన ప్ర‌శ్నించారు. నాలా బిల్లును ఆరు నెలలుగా పెండింగ్ పెట్టారని విమ‌ర్శించారు.

governer 10012018 3

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్ట సవరణ బిల్లును నెల రోజులుగా గవర్నర్ ఆమోదించలేదు అనే ఆరోపనులు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇదే తరహా బిల్లును మూడు రోజుల్లో గవర్నర్‌ ఆమోదించారని విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఒకే రకమైన బిల్ ఉన్నప్పుడు తెలంగాణాకు మూడు రోజుల్లో ఆమోదించి, ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకు అదే రకమైన బిల్ ఎందుకు ఆమోదించలేదో ప్రజలకి చెప్పాలి అని డిమాండ్ చేసారు... అయితే రెండు రాష్ట్రాల్లో గవర్నర్ పై విమర్శలు రావటంతో, కేంద్ర హోం శాఖ కూడా ఈ విషయాల పై ఆరా తీస్తుంది.. నిన్న గవర్నర్ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు..

Advertisements