మన రాష్ట్రంలో, మన ముఖ్యమంత్రిని కొంత మంది కనీస స్థాయి, అర్హత లేని వాళ్ళు, ఆయన్ను ఎలా విమర్శలు చేస్తున్నారో చూస్తున్నాం... ఒకడు ఇంగ్లీష్ రాదు అంటాడు.. ఇంకొకడు, నీ మొఖం చూసి ఎవడు పెట్టుబడులు పెడతాడు అంటాడు... కూలికి, కాంట్రాక్టుకి పని చేసే, పైడ్ బ్యాచ్ అయితే, ఆయన్ను ఎలా అవమానపరుస్తూ, సోషల్ మీడియాలో హేళన చేస్తున్నారో చూస్తున్నాం... కాని ఆయన సమర్ధత ఏంటో తెలిసిన వారు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు.. అందుకే ఆయన మంది రోజు రోజుకి నమ్మకం రెట్టింపు అవుతుంది... విదేశాల్లో అయితే చంద్రబాబుకి ఇచ్చే గౌరవం చెప్పనవసరం లేదు... ఎన్నో దేశాలు, కార్పొరేట్ దిగ్గజాలకు ఆయన అంటే అభిమానం... ఎన్నో సందర్భాల్లో చూసాం... అలాంటి సంఘటన ఇవాళ అమెరికాలో మరోసారి జరిగింది.

america 20102017 2

అమెరికాలోని అయోవా నగరంలో జరిగిన వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబుకి యా వేదిక మీద ఘన స్వాగతం లభించింది. అక్కడ చంద్రబాబు గురించి చెప్తూ, మీకు దీపావళి పండుగ అయినా, ఇక్కడ దాక వచ్చి, మా కోసం మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ముఖ్యమంత్రిని అభినందించారు. అయోవా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ సదస్సులో ముఖ్య వక్తగా చంద్రబాబు పాల్గున్నారు. నదులు అనుసంధానం, ఇరిగేషన్ ప్రాజెక్ట్లు, వ్యవసాయంలో ఆధునికత, ఇలా అన్ని విషయాల పై చంద్రబాబు ప్రసంగించారు. వ్యవసాయరంగానికి సంబంధించి వివిధ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అయోవా యూనివర్సిటీకి కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

america 20102017 3

1987 నుంచి వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ ప్రముఖులకు అవార్డులను అందజేస్తున్నది. వ్యవసాయరంగంలో, ఆహార పంపిణీలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ఫౌండేషన్‌ అందజేస్తోంది. అయోవా విశ్వవిద్యాలయ ప్రతినిధి దిలీప్‌కుమార్‌ స్వయంగా మే నెలలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అప్పుడే ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలియజేశారు.

 

Advertisements