ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై ఏపి ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి కొనసాగిస్తోంది... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన భేటి, ఇవాళ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది... కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు.... రెవెన్యూ లోటు, రైల్వే జోన్, ఈఏపీ ప్రాజెక్టులపై చర్చించారు... ఏపీకి నిధుల విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.... ఈ నేపధ్యంలో ముందుగా, విభజన చట్టంలో అతి ముఖ్యమైన రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం దిగివచ్చింది...

railway zone 10022018 2

వారం, పది రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది... ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ రైల్వేసెక్షన్‌తో కలిపి రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి కేంద్రం మొగ్గు చూపినట్టు సమాచారం... అయితే వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగాన్ని, ఒరిస్సాకి ఇస్తేనే, సహకరిస్తామని ఒరిస్సా ప్రజా ప్రతినిధులు అంటునట్టు సమాచారం... అందుకే, విశాఖ ఒక్కటే కాకుండా, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను కూడా వైజాగ్ రైల్వే జోన్ పరిధిలోకి తెస్తున్నట్టు సమాచారం...

railway zone 10022018 3

ఈ ప్రతిపాదనతో, ఒడిశాకు చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సుజనా చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలీకృతమైనట్లు, దాంతో వెంటనే రైల్వేజోన్ ప్రకటనకు రంగం సిద్ధం చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు అమిత్‌షా చెప్పినట్టు సమాచారం. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని, వచ్చే వారం ప్రకటన చేసే అవకాసం ఉందని సమాచారం.. ఆంధ్రప్రదేశ్‌లో 3,704 కిలోమీటర్ల మేర రైలు మార్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రైల్వే జోన్‌ లేదు... దీంతో తమ రాష్ట్రానికి ఎందుకు జోన్‌ ఏర్పాటు చేయట్లేదంటూ ఏపీ నేతలు ఆందోళన చేస్తున్నారు... ప్రస్తుతం ఈ డిమాండ్ల విషయంలోనూ పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి....

Advertisements