రాష్ట్రంలో మూడున్నరేళ్ల కిందటి కరెంటు కష్టాల గుర్తులు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంది. మారుమూల గిరిజన తండాల్లోనూ విద్యుత్‌ను అందిస్తూ ‘అందరికీ విద్యుత్’ పథకం అమలులో దేశంలోనే మనం ముందు ఉన్నాం.. రిశ్రమలకు కోరినంత విద్యుత్తును అందిస్తున్నాం. పంటలకూ ఏడు గంటలపాటు పగటిపూటే నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం. విద్యుత్ రంగంలో దాదాపు అన్ని అంశాల్లో దేశంలోనే మనం ముందున్నాం. మరీ ముఖ్యంగా సోలార్, విద్యుత్ పొదుపు అంశాల్లో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ఇప్పుడు అందుకే మిగతా రాష్ట్రాల వారికి మనం ఆదర్శం అయ్యాం... మన రాష్ట్రం వచ్చి, మన పని తీరు తెలుసుకుని వెళ్తున్నారు...

gujarat 05112017 1

రాష్ట్ర ఇంధన విధానంపై అధ్యయనం చేసేందుకు, గుజరాత్‌ ఇంధన సంస్థ బృందం మన రాష్ట్రానికి వచ్చింది.. జరాత్‌ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ జయనీష్‌ మోదీ బృందం రెండు రోజులుగా రాష్ట్ర ఇంధన సంస్థల పనితీరు పై అధ్యయనం చేసి, విద్యుత్‌ పంపిణీ, సరఫరా నష్టాల్లో గుజరాత్‌ కంటే ఆంధ్రప్రదేశ్‌ మెరుగ్గా ఉందని కితాబు ఇచ్చింది... రెండు రోజుల పాటు అధ్యయనానికి వచ్చిన బృందానికి, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో అధికారులు, కావాల్సిన డేటా అంతా ఇచ్చి, అన్నీ వివరిస్తూ సహకరించారు...

gujarat 05112017 3

అన్నీ సమగ్రంగా అధ్యయనం చేసిన గుజరాత్‌ బృందం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధన సంస్థలు ఆర్థికంగానూ, సాంకేతికంగానూ బలోపేతంగా ఉన్నాయని, గుజరాత్‌తో పోల్చితే ఆంధ్రాలో లైన్‌లాసెస్‌ చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ కి విద్యుత్ రంగంలో అన్ని అవార్డు లు వస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం అని పేర్కుంది... అలాగే గుజరాత్ లో, విద్యుత్ రంగంలో అనుసరిస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి కూడా, ఆంధ్రప్రదేశ్ అధికారులు అడిగి తెలుసుకున్నారు...

Advertisements