గుంటూరు లోక్‌సభ తెదేపా అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. గుంటూరు లోక్‌సభ స్థానంతోపాటు, దాని పరిధిలోని శాసనసభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. గుంటూరు లోక్‌సభతో పాటు, తెనాలి, పొన్నూరు అభ్యర్థులపైనా సీఎం స్పష్టతనిచ్చారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పోటీ చేయనున్నారు. రాజకీయ, సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసి నిర్ణయం తీసుకోవలసి ఉన్న నేపథ్యంలో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్ని పెండింగ్‌లో ఉంచారు.

108 26112018 1

గుంటూరు లోక్‌సభ స్థానంపై పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు, గుంటూరు ఎంపీ జయదేవ్‌తో సీఎం సుమారు అరగంటపాటు చర్చించారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, ధూళిపాళ్ల నరేంద్రలతోను వేర్వేరుగా సమావేశమయ్యారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ కూడా ముఖ్యమంత్రిని కలిసినా, ఆయనతో ఎక్కువ సమయం చర్చించలేదని పార్టీ వర్గాల సమాచారం. శ్రావణ్‌తో పాటు, మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకుల్ని మళ్లీ కలుద్దామని చెప్పి పంపించారు. గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని మిగతా ఐదు శాసనసభ స్థానాల్లోను ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. తాడికొండ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో పాటు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, గుంటూరు జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ కూచిపూడి విజయ తదితరులు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. డొక్కా 2014 వరకు తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నారు.

108 26112018 1

తాడికొండ కాకపోతే ప్రత్తిపాడు ఇవ్వమని అడుగుతున్నారు. ప్రత్తిపాడు టికెట్‌ని మాజీ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు, పాత్రికేయుడు కృష్ణాంజనేయులు కూడా ఆశిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మద్దాళి గిరి మళ్లీ టికెట్‌ ఆశిస్తున్నారు. సినీ నటుడు అలీకి ఇక్కడ టికెట్‌ ఇస్తారన్న ప్రచారమూ ఉంది. గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల ఖరారుకు రెండ్రోజులపాటు చంద్రబాబు జరిపిన సమీక్షకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి హాజరు కాలేదు. నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకత నెలకొంది. పైగా ఆయన వైసీపీలో చేరి నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అక్కడా సీటుపై సరైన హామీ లభించకపోవడంతో ఆయన ఊగిసలాట ధోరణితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో వ్యతిరేకత కంటే.. కొన్నాళ్ల క్రితం ఒక వన భోజన కార్యక్రమంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే టీడీపీ వర్గాలకు ఆగ్రహం తె ప్పించాయి.

Advertisements