గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద జాతీయ రహదారిపై, నిన్న బీభత్సం సృష్టించిన జీవీఎల్ కారుకి గొప్ప చరిత్రే ఉంది. బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఆ పార్టీ పేరున రిజిస్టర్‌ అయిన కారు. అందులో జీవీఎల్‌ నరసింహరావు లాంటి నాయకుడు తిరిగే కారు. ఆగుతుందా? సరిగ్గా గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద అదే జరిగింది. జీవీఎల్‌ ఉపయోగిస్తున్న కారు విజయవాడలో అడుగడుగునా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించింది. మరో జిల్లాలో కొన్న ఇన్నోవాను ఏపీ16సీఎస్‌1616 నంబర్‌తో విజయవాడలో రిజిస్టర్‌ చేశారు. విజయవాడ వచ్చినప్పుడల్లా ఎంపీ దీనిని ఉపయోగిస్తున్నారు.

gvl 25082018 2

విజయవాడలోని చుట్టుగుంట, ఈఎస్ఐ ఆస్పత్రి బస్టాప్‌, వెటర్నరీ జంక్షన్‌, సీతారామపురం జంక్షన్‌లలో ఈ కారు ట్రాఫిక్‌ ఉల్లంఘనలు చేసింది. దీనిపై ఐదు చలానాలు ఉన్నాయి. వాటిలో అతివేగానికి సంబంధించి రెండు ఉన్నాయి. మొత్తం 1275 రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విజయవాడవైపు వెళ్తున్నారు. మంగళగిరి బాలాజీనగర్‌కు చెందిన తెన్నేరు అంజమ్మ(38), తోట శైలజ ఆటోలో కొలనుకొండ సాయిబాబా గుడి వద్ద దిగారు. బంధువు బాబూరావు ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో వేగంగా వస్తున్న వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. శైలజ తీవ్రంగా గాయపడింది.

gvl 25082018 3

యాక్సిడెంట్లు జరగడం సర్వసాధారణం కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారులో ఉన్న వ్యక్తులను, కారు నడిపిన వారిని సంఘటన స్థలం నుంచి పంపటం, లేదా వారు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోవటం సామాన్యుల విషయంలో జరుగుతదా? జరగనే జరగదు కానీ బిజెపి ఎంపి విషయంలో మాత్రం జరుగుతుంది. ఇద్దరు మహిళలను ఢీ కొట్టాడు అందులో ఒక మహిళ తల పగిలి అత్యంత దారుణంగా మరణించింది, తీవ్రంగా గాయపడింది. కానీ మానవత్వం లేని సదరు ఎంపీ సంఘటనా స్థలం నుంచి తనకేమీ పట్టనట్టు పార్టీ ఏర్పాటు చేసిన కారులో వెళ్లిపోయారు. లేచిన దగ్గర్నుంచి నీతులు చెప్పే జీవీఎల్ దీనికేం సమాధానం చెబుతాడు. సవరించిన మోటర్ వెహికల్ యాక్ట్ ప్రకారం, ఆక్సిడెంట్ జరిగినప్పుడు గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తీసుకు వెళ్ళటం కానీ, వారికి వైద్య చికిత్స అందించకపోవడం కానీ, ఈ రెండిటిని నేరంగా పరిగణిస్తారు.

Advertisements