మంగళవారం అమరావతికి హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌ వచ్చారు... ఉదయం ఐటి మంత్రి లోకేష్ తో సమావేశమైన శివనాడార్‌, సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుని కలుసుకున్నారు. ఈ క్రమంలో కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ ఏం చేయబోతుందన్న దానిపై స్పష్టత ఇచ్చారు. ఏపీఐఐసీకి ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. ఎంఓయూ ప్రకారం ప్రాజెక్టును అమలులోకి తీసుకొచ్చిన తర్వాతే పూర్తి గా రిజిస్ర్టేషన్‌ చేస్తారు.

hcl 28112017 2

ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ శివనాడార్‌ సమావేశమయ్యారు. రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ కు తీసుకువెళ్ళి, అక్కడ పనితీరును శివనాడార్‌కు మంత్రి లోకేష్‌ వివరించారు. ఈ సందర్భంలో శివనాడార్‌ ఆశ్చర్యపోయారు... ఒక ప్రభుత్వ సచివాలయంలో ఇలాంటి సెంటర్, మన దేశంలో ఉంది అంటే ఆశ్చర్యం వేస్తుంది.... ఇక్కడ వాడే టూల్స్, మా సాఫ్ట్ వేర్ కంపనీలలో కూడా వాడారేమో... రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లుక్ కూడా చాలా బాగుంది.... ఎదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది... ఇది ఇది సెక్రటేరియటా ? లేక ఏదైనా ఐటి కంపెనీ హెడ్ ఆఫీసా ? అనేలా ఉంది అంటూ, శివనాడార్‌ కితాబు ఇచ్చారు... ఇలాంటి వాటి వల్ల ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలు అందించవచ్చు అన్నారు...

hcl 28112017 3

ఈ సమావేశంలో మంత్రి లోకేష్‌తో శివనాడార్ పలు అంశాలపై చర్చించారు. గన్నవరం దగ్గర కేసరపల్లిలో ఎల్‌అండ్‌టీ హై టెక్‌ సిటీ పక్కన 28.72 ఎకరాలను హెచ్‌సీఎల్‌కు ఇవ్వటానికి అధికారికంగా ఒప్పందం కుదిరింది. ఏపీఐఐసీ అధికారులు, హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు సోమవారం సేల్‌ అగ్రిమెంట్‌ రాసుకుని గన్నవరం రిజిస్ర్టేషన్‌ కార్యాలయం లో రిజిస్టర్‌ చేయించారు. ఎకరం రూ.30 లక్షల చొప్పున రూ.8.61 కోట్లకు భూములు అప్పగించేలా ఒప్పందంలో నిబంధనలు పొందుపర్చారు. ఏపీఐఐసీతో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం హెచ్‌సీఎల్‌ పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. మొత్తం 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామంది.

Advertisements