విశాఖ విమానాశ్రయంలో తనపై దాడి కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే నిన్న అంతా చంద్రబాబుకి కూడా కోర్ట్ నోటీసులు ఇచ్చిందని, జగన్ మీడియా ప్రచారం చేసింది. కాని చంద్రబాబుకి నోటీసులు ఇవ్వమని జగన్ తరుపు లాయర్ కోరినా, కోర్ట్ మాత్రం ఏపి ప్రభుత్వానికి అదే విధంగా, తెలంగాణా, కేంద్ర ప్రభుత్వాలకి కూడా నోటీసులు ఇచ్చింది. సిట్‌ దర్యాప్తును ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ దర్యాప్తు పురోగతిని సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది.

jagan 14112018 2

హైకోర్టు నోటీసులు జారీచేసిన వారిలో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ(ఉత్తర సబ్‌డివిజన్‌) సహాయ పోలీసు కమిషనర్‌, ఐదో పట్టణ పోలీసుస్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌, కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ డీజీపీ ఉన్నారు. విచారణను రెండు వారాలకు కాకుండా వారానికే వాయిదా వేయాలని జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి చేసిన అభ్యర్థనను సున్నితంగా తోసిపుచ్చిన ధర్మాసనం.. దర్యాప్తు ఎక్కడికి వెళుతుందో వేచి చూద్దామని వ్యాఖ్యానించింది. హత్యాయత్న ఘటనపైనే వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి వేసిన వ్యాజ్యంపైనా హైకోర్టు మరోసారి విచారించింది. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న పోలీసు అధికారి కోర్టుకు హాజరై సీల్డ్‌కవర్‌లో నివేదిక సమర్పించారు

jagan 14112018 3

మాజీ ముఖ్యమంత్రి తనయుడు, ప్రతిపక్ష నేత కాబట్టి జగన్‌పై జరిగిన దాడిన ప్రజలకు ముఖ్యమంత్రి వివరించాల్సిన అవసరం ఉంది కదా? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. అప్పటికే వైకాపా నేతలు పలువురు ధర్నాలకు దిగారని వివరించారు. దర్యాప్తును నియంత్రించడం, ఏ దిశలో జరగాలో తెలిపే వ్యాఖ్యలను సీఎం, డీజీపీ చేయలేదని అన్నారు. జగన్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రజలు ఆందోళనలో ఉన్నప్పుడు దాడి ఘటన డ్రామా అని సీఎం చెప్పాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇరువైపులా వాదనలు, సిట్‌ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దర్యాప్తును ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ ముఖ్యమంత్రి తప్ప మిగిలిన ప్రతివాదులకు నోటీసులిస్తున్నామని పేర్కొంది.

Advertisements