అమరావతిలో, రాయపూడి రెవెన్యూ పరిధిలో ఐదెకరాల్లో జరుగుతున్న హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చక చకా జరుగుతున్నాయి... రాజధానిలో ఉద్యోగులు కోసం, 1,450 ఎకరాల్లో, 3,840 ఇళ్ల నిర్మాణం కోసం ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు... 2017 నవంబర్ లో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్, ఫిబ్రవరి 2019 నాటికి, పూర్తి కానుంది... 15 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించారు... ఆ విధంగానే పనులు కూడా జరుగుతున్నాయి... పైల్‌ పౌండేషన్‌ పనులు చివరి దశకు వచ్చాయి... మార్చి పదో తేదీన గ్రౌండు శ్లాబు, 18న మొదటి శ్లాబు వేసేలా ప్లాన్ చేసారు. మూడు నెలల్లో 12 స్లాబులు పూర్తి చేస్తారు...

amaravati housing 26012018 2

61 టవర్లలో 3,840 ఇళ్లు నిర్మాణం చేస్తున్నారు... శాసనసభ్యులు, అఖిల భారత సర్వీసు అధికారులు మొదలుకుని గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగులకు వీటిలో నివాసవసతి కల్పిస్తామన్నారు. ఇటుకలే అవసరం లేని అత్యధునాతన షియర్‌వాల్‌ టెక్నాలజీతో ఇల్లు నిర్మిస్తున్నారు... ఇందులో 240 ఎమ్మెల్యేల గృహాలు, 144 ఐఏఎస్‌ల ఇళ్ళు, 1968 ఎన్జీవోల ఇళ్లు, 15 క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగస్తుల ఇళ్లు ఉంటాయి...

amaravati housing 26012018 3

మంత్రి నారాయణ, వారానికి రెండు సార్లు వచ్చి, ఈ ప్రాజెక్ట్ పురోగతి చూస్తున్నారు... మొత్తం 97 రిగ్గులతో రోజుకు 220 ఫైల్స్‌(పిల్లర్‌లు) పూర్తి చేస్తామని చెప్పారు. 22 రిగ్గులతో తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి చేశామన్నారు. ఆధునిక టెక్నాలజీతో నిర్మాణాలు చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు కల్లా 85 లక్షల చదరపు అడుగులలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు... రైతులకిచ్చిన ప్లాట్లలో కూడా పనులు జరుగుతున్నాయని, అండర్‌ గ్రౌండు డ్రెయినేజీ, విద్యుత్‌, ఇతర మౌలిక సదుపాయాలు ఇదే సమయానికి పూర్తి చేస్తామన్నారు... రాజధానిలో 34 పెద్ద రోడ్లు ఏర్పాటు అవుతున్నట్లు తెలిపారు. ఇందులో 22 రోడ్లకు చెందిన టెండర్లు పూర్తి చేసుకొని నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నట్లు చెప్పారు. రూ.22 వేల కోట్ల మేర టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అసెంబ్లీ , సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవనం, ముఖ్యమంత్రి నివాసం ఇంటర్నల్ డిజైన్‌ నిర్మాణం మీద కసరత్తు జరుగుతుంది అని, వచ్చే నెలలో టెండర్లు పిలిచే అవకాసం ఉందని, వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు.

Advertisements