గన్నవరంలో నిర్మించే హెచ్‌సిఎల్ కంపెనీకి, ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ వద్ద రూ. 408.48 కోట్లతో నెలకొల్పనున్న ప్రత్యేక ఆర్థిక మండలికి (సెజ్)కు కేంద్ర వాణిజ్య శాఖ అనుమతులు ఇచ్చింది. రూ. 408.48 కోట్లతో నెలకొల్పనున్న ప్రత్యేక ఆర్థిక మండలికి (సెజ్) అనుమతి ఇవ్వాలని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కేంద్రాన్ని కోరింది. ఇక్కడ ఐటి, ఐటి ఆధారిత సేవల సంస్థలను నెలకొల్పేందుకు సెజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌సిఎల్ పేర్కొంది. ఈ ప్రతిపాదనను వాణిజ్య శాఖ పరిశీలించింది. వాణిజ్య అంతరంగిక బోర్డు సమావేశం అయ్యి, ఈ విషయం చర్చించింది. ఈ బోర్డు సమావేశానికి వాణిజ్య శాఖ కార్యదర్శి రీతా టియోటియా అధ్యక్షత వహించారు. సుమారు 10.43 హెక్టార్లలో సెజ్‌ను ఏర్పాటు చేయాలన్న హెచ్‌సిఎల్ ప్రతిపాదనను ఆమోదించింది.

hcl 10072018 2

హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చెందిన 27 ఎకరాల్లో ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ చెట్ల తొలగింపు, నేల చదును పనులను సంస్థ ముమ్మరం చేసింది. ఈ పనులు ఒక కొలిక్కి రాగానే సెజ్‌లో భాగంగా ప్రాజెక్టును ఏర్పాటకు, కేంద్రానికి దరఖాస్తు చేస్తుకుంది. ఇప్పుడు అనుమతులు రావటంతో, ఇక నిర్మాణం ప్రారంభించనున్నారు. టవర్‌ నిర్మాణ పనులు పూర్తి కావటానికి ఎంత లేదన్నా ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆగకుండా తక్షణం కార్యకలాపాలు ప్రారంభించటానికి వీలుగా హెచ్‌సీఎల్‌ సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. ఒక వైపు టవర్‌ నిర్మాణ పనులతో పాటే మరోవైపు ‘మేథ’ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది.

hcl 10072018 3

కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి.. దాదాపు రెండు వేల మంది వరకు, ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాసం ఉంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్‌ ప్రణాలికలు రూపొందిస్తుంది...

Advertisements