రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐఏఎస్‌ అధికారులపై ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చివర కు సీఎం-సీఎస్‌ల వరకూ గత కొంతకాలంగా ఉప్పు-నిప్పులా ఉన్న పరిస్థితులు సద్దుమణిగా యన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈనెల 5వ తేదీ ఆదివారం విజయవాడ కేంద్రంగా సుమారు 40 మందికిపైగా ఐఏఎస్‌ అధికారులు రహస్య భేటీ కావడం, అర్థరాత్రి వరకూ కొనసాగిన ఆ సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మొదలుకొని, ఐఏఎస్‌ అధికారుల వరకూ ఉన్న లోపాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ నేతల పక్షాన కాకుండా ఐఏఎస్‌ అధికారుల్లో ఐకమత్యం పెరగాలన్న సీనియర్‌ ఐఏఎస్‌ల వాదనలతో ఏకీభవించిన పలవురు అధికారులు తమ నిర్ణయాలకు ఇకపై కఠినంగానే అమలు చేస్తామని స్పష్టం చేయడం గమనార్హం.

game 27032019

విజయవాడలో ఐఏఎస్‌ అధికారుల రహస్య భేటీపై నిఘా వర్గాలు కూపీ లాగి ఎలాంటి సమాచారం తెలియక పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధితశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణంలో ఏపార్టీకి మెజార్టీ వస్తుందో అన్న అంశంలోనూ చంద్రబాబు నాయుడు ఆచితూచి అంచనాలు వేయడం, కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి వ్యతికేకంగా, కొన్ని టీడీపీకి అనుకూలంగా సర్వే నివేదికలు వెల్లడించడంతో ఆయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీయే అధికారాన్ని చేపట్టనున్నదన్న విషయం స్పష్టం కావడంతో చంద్రబాబు నాయుడు మళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఐఏఎస్‌ అధికారుల్లో తిరుగుబాటు లేదా వ్యతిరేకత ఎక్కువ శాతం ఉన్నట్లయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతోనే కాస్తంత మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది.

game 27032019

కేబినెట్‌ సమావేశానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించేందుకు సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించడంతోపాటు ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు జరపడంతో రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. అలాగే ఇదే ఒరవడిని ముఖ్యమంత్రి కొనసాగించినట్లయితే భవిష్యత్తులో ఐఏఎస్‌లకు, రాజకీయపార్టీల నేతలకు ఎలాంటి ఇబ్బందులు, పొరపొచ్చాలు వచ్చే అవకాశాలు లేవని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం నాటి కేబినెట్‌లో సీఎం చంద్రబాబు, సీఎస్‌ ఎల్వీలు ఎంతో ఉత్సాహంగా కనిపించడంతో సీఎం-సీఎస్‌ల వ్యవహారం ఇక సమసిపోయినట్లే అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వ్యాఖ్యానించారు.

Advertisements