విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియా మాత్రమే విమాన సర్వీసులు నడుపుతోంది. ఇటీవల కాలంలో విజయవాడ రూట్‌లో వారంలో ఏడు రోజుల పాటు నడపాల్సిన విమానాలను నాలుగు రోజుల చొప్పున కుదించి నడుపుతోంది. మరో నెల రోజుల్లో ఈ సమస్య నుంచి బయట పడతామని ఎయిర్‌ ఇండియా ప్రకటిస్తూ వస్తోంది. ఇదే తరుణంలో ఇండిగో విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవాలని నిర్ణయించింది. వెంటనే ఢిల్లీకి విమాన సర్వీసు నడిపే విషయంలో తమ బృందం చేత అధ్యయనం చేయించింది. ఢిల్లీకి ముందుగా ఒక సర్వీసు ఎక్కడా స్టాప్‌ లేకుండా నేరుగా నడపాలని నిర్ణయించింది.

indigo 22082018 2

ఈ మేరకు అక్టోబర్‌ 1 నుంచి బుకింగ్స్‌ కూడా ఇప్పటి నుంచే చేపడుతోంది. ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్‌కు అవకాశం కల్పించింది. ప్రారంభ ధర రూ.5,316గా ప్రకటించింది. నూతన సర్వీసును ప్రారంభిస్తున్న సమాచారాన్ని ఇంతవరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విజయవాడ విమానాశ్రయ అధికారుల దృష్టికి అయితే తీసుకు రాలేదు. రోజూ సాయంత్రం 4 గంటలకు..రోజూ సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీకి విమానాన్ని నడపాలని ఇండిగో విమానయానసంస్థ నిర్ణయించింది. సాయంత్రం 3.45 గంటలకు విజయవాడ వస్తుంది. విజయవాడ నుంచి 4 గంటలకు ఈ విమానం బయలు దేరుతుంది. సాయంత్రం సమయంలో ముందుగా ఢిల్లీకి బయలుదేరాలనుకునే వారికి ఈ విమాన సర్వీసు సౌకర్యవంతంగా ఉంటుంది.

indigo 22082018 3

విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నడిచే విమాన సర్వీసుల సంఖ్య మొత్తం నాలుగుకు చేరింది. ఎయిర్‌ ఇండియా సంస్థ మొత్తం మూడు సర్వీసులను నడుపుతోంది. ఉదయం 9.10 నిమషాలకు ఒకటి, సాయంత్రం 5.20 గంటలకు ఒక సర్వీసు, రాత్రి 9.10 గంటలకు మరో సర్వీసు చొప్పున నడుపుతోంది. ఈ సర్వీసులకు తోడు ఇండిగో విమాన సర్వీసు కూడా జతకూడటంతో విజయవాడ నుంచి ఢిల్లీకి నాలుగు సర్వీసులతో మెగా రూట్‌గా ఉంది.

Advertisements