ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ వచ్చింది. గుంటూరులో సెమి కండక్టర్ పార్క్ ఏర్పాటుకు ఇన్వెకాస్ ముందుకు వచ్చింది. ఆటోమోటివ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,బయో మెడికల్ రంగాల్లో ప్రోటోటైపింగ్,సెమి కండక్టర్ తయారీలో ఇన్వెకాస్ సంస్థ ఉంది. దేశంలోనే ప్రముఖ సెమి కండక్టర్ తయారీ కంపెనీగా ఇన్వెకాస్ కు పేరు ఉంది. ఇన్వెకాస్ రాకతో హై ఎండ్ ఉద్యోగాల కల్పన జరగనుంది. విశాఖపట్నం ఐటీ హబ్ గాను,తిరుపతి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ కేంద్రం గాను,అమరావతి తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హై ఎండ్ టెక్నాలజీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి నారా లోకేష్, అమరావతి తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హై ఎండ్ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా
ఇన్వెకాస్ మొదటి అడుగు కాబోతోంది.

invecase 290620018 2

ఈ కంపెనీని, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.. నగరంలోని విద్యా నగర్‌ 1వ లైనులో నిర్మించిన వేద ఐఐటి అండ్‌ ఇన్వేకాస్‌ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గుంటారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి మేరకు నగరంలోని విద్యానగర్‌ ఒకటో లైనులో ఏడు అంతస్థుల భవనంలో ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికే మంగళగిరికి పై డేటా సెంటర్‌ని తీసుకొచ్చి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వారం రోజుల క్రితం రాజధానిలోని రాయపూడిలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేశారు. 36 అంతస్థులలో నిర్మాణం జరగనున్న ఆ టవర్‌ ఐటీ కంపెనీలకు హబ్‌గా మారనుంది.

invecase 290620018 3

తాజాగా గుంటూరు నగరానికి తొలిసారిగా ఐటీ కంపెనీని తీసుకురాబోతోన్నారు. ఇందులోనూ వందల సంఖ్యలో సాఫ్టువేర్‌, హార్డ్‌వేర్‌ ఉద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. 24 వేల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నిర్మించిన వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు ఒకే టవర్‌లో కార్యకలాపాలాను ప్రారంభించనున్నాయి. బెంగుళూరు,అమెరికా పర్యటనల్లో భాగంగా పలు మార్లు ఇన్వెకాస్ ప్రతినిధులతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి నారా లోకేష్ ఒప్పించారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి తదితర వివరాలు ప్రకటిస్తారు.

Advertisements