మన భారత దేశం గొప్పతనం ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ప్రజాభిప్రాయంతో పని లేకుండా అయిపోతుంది. అందరూ చూస్తూ ఉండగా వేల వేల దొంగ ఓట్లు వేస్తున్నా, మీడియాలో చూపించినా, వాటి పై ఇప్పటి వరకు ఒక్క వ్యవస్థ కూడా స్పందించలేదు. ఇలా అయితే ఇక ఈ ప్రజాస్వామ్యం పై ఎవరికి నమ్మకం ఉంటుంది ? ప్రతిపక్ష పార్టీలు సరిగ్గా పోరాటం చేయటం లేదా ? లేదా తప్పు ప్రజల్లో ఉందా ? లేదా వ్యవస్థల్లో ఉందా ? ఇప్పుడు వదిలేసారు. ఇదే ఇక ప్రతి ఎన్నికలో చేస్తారు కదా ? అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చేస్తారు కదా ? ఇప్పటికే మీకు మనం దేనికి గురించి మాట్లాడుకుంటున్నామో అర్ధమయ్యే ఉంటుంది. భారత దేశ ప్రజాస్వామ్యం అపహస్యమైన తిరుపతి ఉప ఎన్నిక గురించి. తిరుపతి ఉప ఎన్నిక ఇరు పార్టీలు హోరాహోరీగా తీసుకున్నాయి. అప్పటికే వాలంటర్లతో చేయాల్సింది చేసారు, ముందు రోజు మందు, డబ్బులు సరే సరే. అయినా మరి ఎందుకు అనుమానం వచ్చిందో, ఒక పార్టీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించింది. ఇవన్నీ మీడియాలో కనిపించాయి. ఏదో ఒకటి రెండు సంఘటనలు కాదు. ఏకంగా ఒక 50 సంఘటనలు అయినా మీడియా కవర్ చేసి ఉంటుంది. ఇక వెలుగులోకి రానివి ఎన్నటి ఉంటాయో. ఇలా అనేక ఘటనలు ఆ రోజు జరిగాయి.

ec 01052021 2

ముందు రోజే పక్క నియోజకవర్గాల నుంచి జనాలను తోలుకుని వచ్చి, కళ్యాణమండపాలలో పెట్టారు. ఉదయం ఒక జాతర లాగా బయలు దేరారు. కొన్ని పార్టీలు అడ్డుకున్నాయి. ఇక లైన్ లో నుంచున్న వారి దగ్గరకు వెళ్లి, కార్డు తీసుకుని, మీ నాయన పేరు ఏంటి అంటే చెప్పలేక పోయారు, మీ భర్త పేరు అంటే చెప్పలేక పోయారు, కొంత మంది సమాధానం చెప్పలేక పరిగెత్తారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కు కొన్ని పార్టీలు ఫిర్యాదు చేసాయి. ఎన్నికల కమిషన్ వారికి వచ్చిన రిపోర్ట్ లు అన్నీ సక్రమంగా ఉండటంతో, వారు కూడా పట్టించుకోలేదు. ఇక హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్ట్ ఏమో ఇది మా పరిధిలోకి రాదు, మీకు సమయం ఉంది కాబట్టి ఎన్నికల పిటీషన్ వేసుకోండి అని చెప్పారు. ఇది సరిగ్గా ఎన్నికల కౌంటింగ్ కు రెండు రోజులు ముందు చెప్పారు. ఒక పక్క వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మీడియా కధనాలు ఉన్నాయి. దొంగ ఓట్లు పోలు అయ్యాయి అని అందరికీ తెలుసు. ఒక్క కేసు లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయటం లేదు, ఒక్క చర్య కూడా లేరు. రేపు పోలింగ్ కూడా జరిగిపోతుంది. ఈ పరిస్థితిలో, ఎన్నికల వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం ఉంటుందా ? అన్ని వ్యవస్థలు ఈ విషయం పై ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి.

Advertisements