ఐటిసి లిమిటెడ్ నవ్యాంధ్ర మీద అమితమైన ప్రేమ చూపిస్తుంది... ఇప్పటికే ఐటీసీ హెడ్ క్వార్టర్స్ గుంటూరుకు మార్చింది... ఆగ్రి డివిజన్ కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చింది... మొన్న పేపర్ మిల్ కూడా పెడతామని అని అధికారులని స్థలం కోరింది... ఇప్పుడు ఐటిసి డెయిరీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో డెయిరీని నెలకొల్పేందుకు రెడీ అవుతోంది. దీనికోసం అనుమతులని కూడా అధికారులని అడిగింది. సాధ్యమైనంత త్వరగా స్థల సేకరణను పూర్తి చేసి ప్లాంట్ నిర్మాణం చెయ్యనున్నారు.. డెయిరీతో పాటు, అనుబంధ ఉత్పత్తులను కూడా ఇక్కడ ఉత్పత్తి చెయ్యనున్నారు..

ఇప్పటికే ఐటిసి ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో డెయిరీలను నిర్వహిస్తోంది.

Advertisements