విభజన తరువాత ఇండియన టుబాకో కంపెనీ (ఐటీసీ) నవ్యాంధ్రలోని 13 జిల్లాలకు గుంటూరు కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో ఐటీసీ పేపర్‌ మిల్లు కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటి వరకు భద్రాచలం కేంద్రంగా ఐటీసీ పేపర్‌ మిల్లు ఉంది.

నవ్యాంధ్రలోని 13 జిల్లాలో ఐటీసీ పేపర్‌ సరఫరా కోసం అమరావతి ప్రాంతాల్లో మిల్లును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాదాపు రూ.150 కోట్ల పెట్టుబడితో ఐటీసీ పేపర్‌ మిల్లు పెట్టనుంది. దాదాపుగా 300 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

ఈ ప్రతిపాదన ఇప్పుడు సీఆర్డీయే ముందు ఉంది. ప్రభుత్వం స్థలం కేటాయించిన వెంటనే పేపర్‌ మిల్లును ఏర్పాటు చేయ్యనుంది ఐటీసీ.

Advertisements