ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గత రెండు సంవత్సరాల నుంచి "నేనే ముఖ్యమంత్రి " "నేనే ముఖ్యమంత్రి " అంటూ తిరుగుతూ ఉండటం చూసాం... ఒకానొక సందర్భంలో మాత్రం ఏకంగా "ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్తున్నాం నువ్వు" అని అనటంతో ప్రజలు అందరూ అవాక్కయ్యారు... తరువాత ఎన్నో అవార్డులు అందుకున్న నెంబర్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ అహ్మద్ బాబుని, జైలుకు తీసుకుపోతా అన్నారు... తరువాత పాదయాత్రలో కూడా నేను వచ్చిన తరువాత మీకు ఏది కావాలంటే అది చేస్తా అంటూ చెప్తున్నారు... ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు జగన్ మరింత ముందుకు వెళ్లారు...

jagan 04012018 2

ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఇప్పుడు జగన్ ఏకంగా క్యాబినెట్ మంత్రుల్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు... పలానా అతను గెలిస్తే, పలానా మంత్రి పదవి ఇస్తాను అంటూ, ప్రజల ముందే ప్రకటిస్తూ ఉండటంతో, ప్రజలకు క్లారిటీ వచ్చింది... "నేనే ముఖ్యమంత్రి " అనే వ్యాధి తగ్గకపోగా, నెక్స్ట్ స్టేజిలోకి వెళ్లి మరింత పెరిగింది అంటున్నారు... జగన్ పాపం ఇలాగే కంటిన్యూ అయితే, ఏమైపోతాడో అని ప్రజలు జాలి పడుతున్నారు... దీనికి ఏదోఒకటి చెయ్యకపోతే, అంబటి రాంబాబు అన్నట్టు, ఇక నేనే ప్రధాని అని కూడా అంటారేమో... లేకపోతే నేనే అమెరికా ప్రెసిడెంట్ అని కూడా అంటారేమో...

jagan 04012018 3

జగన్ పాదయత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన గురువారం పెద్దూరులో మాట్లాడారు. కుప్పం పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త చంద్ర‌మౌళికి ఓటు వేసి గెలిపిస్తే కేబినెట్‌లో కూర్చోబెట్టి చంద్ర‌బాబు కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు.

Advertisements