వైసీపీ అధినేత జగన్‌ను సీఎం చంద్రబాబు నిలదీశారు. గురువారం సాయంత్రం జగన్.. నటుడు మహేష్‌బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌లో అవేంజర్స్ మూవీకి వెళ్లారు. జగన్ సినిమాకు వెళ్లడంపై ఆయన తప్పుబట్టారు. తుఫాన్‌ సమయంలో ప్రతిపక్ష నేత విదేశాలకు వెళ్తున్నారని, ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని జగన్ సినిమాకు వెళ్ళారేమో అని ఎద్దేవాచేశారు. జగన్ ఎప్పుడు రాష్ట్రంలో ఉన్నారని... ఇప్పుడు ఉండటానికి అని చంద్రబాబు విమర్శించారు. నిన్న కుటుంబ సమేతంగా జగన్ లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే సడన్‌గా టూర్ రద్దైంది. అయితే టూర్ ఎందుకు రద్దు అయ్యింది..? జగన్ ఎందుకు రద్దు చేసుకున్నారు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

endgame 04052019

మరోవైపు ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలలో సీఎస్‌లు వెళ్లి సీఎంకు రిపోర్ట్ చేస్తారని, మన దగ్గర మాత్రం సీఎం వద్దకు సీఎస్‌ రారని ఆరోపించారు. సీఎస్‌ను రమ్మని తాము అడుక్కోవాలా?.. రివ్యూలకు రారా అని ప్రశ్నించారు. ఇక్కడి అధికారులు చదువు కోలేదా....చట్టం తెలీదా అని చంద్రబాబు నిలదీశారు. బిజినెస్‌ రూల్స్ ప్రకారం ఎవరు ధిక్కరించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. వచ్చే వారం కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అధికారులను కోడ్ పేరుతో ఎలా ఆపుతారో చూస్తామన్నారు. ప్రధాని మోదీ నాలుగు సార్లు కేబినెట్ మీటింగ్ పెట్టలేదా అని మరోసారి ప్రశ్నించారు.

endgame 04052019

మోదీ మళ్లీ రారన్న విషయం నాలుగు దఫా ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. తుఫాన్‌పై సమీక్షకు అడ్డుతగిలారని సీఎం మండిపడ్డారు. తుఫాన్ దాటిపోయాక అనుమతిచ్చారని, హద్దులు తెలియకుండా ఈసీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రెగ్యులర్‌ పనులకు ఎలక్షన్ కమిషన్‌తో సంబంధం లేదని, ఢిల్లీలో ప్రధాని మాత్రం ఎవరి అనుమతి లేకుండా అన్నీ చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్‌ తన హద్దుల్ని తెలుసుకుని వ్యవహరించాలని చంద్రబాబు చెప్పారు. సోమవారం పోలవరం వెళ్తున్నానని, తనను ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. తనకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

Advertisements