ప్రజా సేవ, ఆయన లక్ష్యం... ప్రజా సమస్యల పరిష్కారం నీతి కృత్యం... అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా... ప్రతిక్షం జనం గురించే, జనం కోసమే, జనమే ఊపిరిగా బ్రతికారు దివంగత నేత ఎర్రం నాయుడు... బడుగు, బలహీన వర్గాల కోసం పని చేస్తూ, ఆయన రాజకీయ జీవితంలో చివరి వరకు పోరాడారు... ఆయన వారసత్వం తీసుకుని, సిక్కోలు యువ సింహంలా గర్జిస్తూ... ఎర్రన్న అడుగుజాడల్లో ప్రజలకోసం ఉద్యమిస్తూ... ప్రజాగళాన్ని...పార్లమెంటులో వినిపిస్తున్న యువ కిశోరం... కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా, తండ్రి బాటలోనే ప్రజా సమస్యలు తీరుస్తున్నారు... ఇదే ఇప్పుడు ప్రతి పక్ష నేత వైఎస్ జగన్ ను ఇబ్బంది పెడుతున్న అంశం... కుర్ర ఎంపీ ఇప్పుడు జగన్ ను గడగడలాడిస్తున్నాడు... జిల్లా మొత్తాన్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నాడు...

jagan 18122017 2

రామ్మోహన్ నాయుడు స్థానికంగా ప్రజా సమస్యలనే కాదు, పార్లమెంట్ లో కూడా మార్కులు కొట్టేస్తున్నారు... ప్రతి పక్ష పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, దూకుడుగా వెళ్తున్నారు... పార్ల‌మెంటులో ఆంధ్రా స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ళ‌మెత్తుతూ కేవ‌లం శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌ల్లోనే కాకుండా తెలుగు ప్ర‌జ‌ల్లో కూడా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు. తాజాగా విశాఖ రైల్వేజోన్‌పై పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు ఆయ‌న ప్రైవేటు బిల్లు కూడా ప్ర‌వేశ పెడుతోన్న సంగ‌తి తెలిసిందే... పార్ల‌మెంటులో ఏపీ నుంచి ఎంతో మంది సీనియ‌ర్ ఎంపీలు ఉన్నా రామ్మోహ‌న్ నాయుడు వాయిస్ మాత్ర‌మే వినిపిస్తుండ‌డం, ప్రతి పక్ష గొంతు అసలు వినిపించకపోవటం జగన్ కు ఇంకా చిరాకు తెప్పిస్తుంది...

jagan 18122017 3

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రెడ్డి శాంతిపై రామ్మోహ‌న్ నాయుడు ఏకంగా 1.27 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. అయితే ఈ సారి జగన్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా, మ్మినేని సీతారాంను రంగంలోకి దించాడు... అయితే తమ్మినేని మాత్రం, రామ్మోహన్ స్పీడ్ కు తట్టుకోలేక, ఎన్నికల ముందే చేతులు ఎత్తేశాడు... ఆ కుర్రాడిని ఎదుర్కోలేను అని, జగన్ కు చెప్పేసాడు కూడా... ఇప్పుడు జగన్ కొత్త కాండిడేట్ కోసం ఎదురు చూస్తున్నారు.. కాని, రామ్మోహన్ నాయుడుని ఎదుర్కోవాటానికి, జగన్ కు ఇప్పటి వరకు ఎవరూ దొరకలేదు... ఈ ఎఫెక్ట్ మొత్తం జిల్లా పై పడుతుంది అని జగన్ తెగ ఆందోళన చెందుతున్నారు...

Advertisements