"పోలవరం ప్రాజెక్టు కొనసాగించాల్సిన అవసరం ఆంధ్రరాష్ట్రానికి లేదు. కానీ ఆంధ్రరాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క అవసరం యుద్ధప్రాతిపదికన పోలవరం పూర్తి చేయాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది." ఇది పోలవరం ప్రాజెక్ట్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైయస్‌ జగన్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం నిర్మించాల్సిన అవసరం లేదని, కేంద్రం చేస్తాను అంటే కేంద్రానికి ఇచ్చేస్తాం అని, మాకు తొందరగా ప్రాజెక్ట్ పూర్తి చెయ్యటం కావాలని జగన్ అన్నారు. అయితే జగన్ వ్యాఖ్యల పై మాత్రం, కొంచెం అవగాహన రాహిత్యం కనిపిస్తుంది. ఎందుకంటే, పోలవరం ప్రాజెక్ట్, కేంద్రం లేట్ చేస్తుందనే, నీతి ఆయోగ్ సూచన మేరకు రాష్ట్రానికి ఇచ్చి, వేగంగా పనులు జరిగేలా చేసారు.

jagan 26052019 1 1

దీనికి కారణం కూడా లేకపోలేదు. దేశంలో మొత్తం 16 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించినా, కేంద్రం అలసత్వంతో వాటి పనులు పూర్తి కాలేదు... అసోంలోని కుల్సి డ్యామ్‌, ఏపీలోని పోలవరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నోవా-దిహింగ్‌ ప్రాజెక్టు, అప్పర్‌ సియాంగ్‌ ప్రాజెక్టు, హిమాచల్‌ప్రదేశ్‌లోని రేణుకాడ్యామ్‌, ఉత్తరాఖండ్‌లోని కిషుయా బహళార్థ సాధక ప్రాజెక్టు, జమ్ము కశ్మీర్‌లోని ఉజ్‌, బుర్సార్‌, మహారాష్ట్రలోని గోసిఖుర్ద్‌, యూపీలోని కెన్‌బెట్వా, సరయు నహర్‌ పరియోజన, పంజాబ్‌లోని షాపూర్‌కండి, రవివ్యాస్‌, పశ్చిమ్‌ బంగలోని తీస్తా, ఉత్తరాఖండ్‌లోని లక్వార్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఉన్నాయి... వీటిలో మన పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్ట్ లు, దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది.

jagan 26052019 1 1

మొత్తం 16 నీటి పారుదల ప్రాజెక్ట్ ల ప్రస్తుత స్తితి చూస్తే, మన రాష్ట్రం నిర్వహిస్తున్న పోలవరం తప్పితే, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిగిలిని అన్నీ ప్రాజెక్ట్ లు అసలు ముందుకు కదలటం లేదు... ఇంకా దారుణం ఏంటి అంటే, 10 ప్రాజెక్ట్ లు కనీసం రిపోర్ట్ దశను కూడా దాటలేదు... మిగిలిన 5 ప్రాజెక్ట్ ల పనులు అసులు జరగటం లేదు... 16 జాతీయ ప్రాజెక్ట్ లలో, మన పోలవరం మాత్రమే, ఈ పరిస్థితిలో ఉంది... దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... అందుకే చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పడినా, తన నెత్తిన వేసుకుని పనులు వేగం పెంచారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం కట్టాల్సిన అవసరం లేదని, అది కేంద్రమే కట్టాలని అంటున్నారు. మరి లెక్కలు చూస్తే, ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా వేగంగా కదలటం లేదు. కొంచెం గ్రహించండి జగన్ గారు. చంద్రబాబు చేసిన పనులు ఇలా మధ్యలో ఆపితే, చంద్రబాబుకి ఏమి కాదు, రాష్ట్రం నష్టపోతుంది.

Advertisements