అక్ర‌మాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తి శుక్ర‌వారం కోర్టులో హాజ‌రవుతోన్న విష‌యం తెలిసిందే. నవంబర్ 2 నుంచి తాను పాద‌యాత్ర చేయ‌నున్న నేప‌థ్యంలో ఆరు నెల‌ల పాటు త‌న‌కు కోర్టులో ప్రతి శుక్రువారం వ్య‌క్తిగ‌త హాజ‌రు పై మిన‌హాయింపు ఇవ్వాల‌ని ఆయ‌న వేసిన పిటిష‌న్‌ పై శుక్రవారం సీబీఐ కోర్టులో మ‌రోసారి విచార‌ణ జ‌రిగింది. జగన్ తరపు న్యాయవాది, సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు.

jagan 20102017 2

జగన్ చేపట్టనున్న పాదయాత్రకు ఇబ్బంది లేకుండా ప్రతి శుక్రువారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది వాదించారు. "మా క్లైంట్ మిస్టర్, జగన్ మోహన్ రెడ్డి ఈజ్ ఏ ఫుల్ టైం పొలిటీషన్, నాట్ ఏ బిజినెస్‌మన్" ఇది ఇవాళ సిబిఐ కోర్ట్ లో, జగన్ తరుపు లాయర్లు కోర్ట్ కి తెలిపిన వివరణ... మా క్లైంట్, ఫుల్ టైం పొలిటీషన్, ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాడాల్సి ఉంది. ప్రజల్లోకి వెళ్ళాసిన అవసరం ఉంది. 6 నెలల పాటు మూడు వేల కి.మీ పాదయాత్ర తల చేస్తున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలంటే సీరియస్‌నెస్ తగ్గుతుంది. అందుకే ఈ ఫుల్ టైం పొలిటీషన్ కి, ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయించాలి అంటూ, జగన్ తరుపు లాయర్లు కోర్ట్ కి తెలిపారు.

అసలు ఈయన "ఫుల్ టైం పొలిటీషన్" ఏంటి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు... ఎదో నెలకు ఒక సారి బయటకు వచ్చి, సాయంత్రానికి హైదరాబాద్ పోయే ఈయన ఫుల్ టైం పొలిటీషన్ అని అని అంటున్నారు. గత రెండు నెలలుగా, రెండుసార్లు అనంతపురం, ఒకసారి విజయవాడ పర్యటన చేసిన ఈయాన ఫుల్ టైం పొలిటీషన్ ఏంటో అర్ధం కాక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు... ఈయన ఎంత సీరియస్‌ గా ఉన్నారో ఇదే నిదర్శనం అని, సీబీఐ లాయర్ కూడా ఇదే విషయం కోర్ట్ కి తెలిపాలి అని అంటున్నారు.

jagan 20102017 3

అయితే విచారణ తప్పించుకునేందుకు జగన్ పిటిషన్ వేశారని సీబీఐ వాదించింది. 11 కేసుల్లో జగన్ నిందితుడని, విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో జగన్‌‌కు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని సీబీఐ కోరింది. రాజకీయ కారణాలతో ఏకంగా ఆరు నెలలు మినహాయింపు సరికాదని సీబీఐ లాయర్ వాదించారు. జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఇవ్వవద్దని కోరింది. అటు సీబీఐ, ఇటు జగన్ తరుపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి... తమ నిర్ణయాన్ని ఈనెల 23కు వాయిదా వేశారు. దీంతో జగన్ క్యాంప్ టెన్షన్, మరో మూడు రోజులు కంటిన్యూ అవ్వనుంది.

Advertisements