పార్టీలో చెరక ముందే, ఆనం రామనారాయణరెడ్డికి జగన్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నా, దాదాపు వైసిపీలో, ఆనం రామనారాయణరెడ్డి చేరిపోతరనే ప్రచారం జరిగింది. అయితే, ఆనం మాత్రం వెంకటగిరి టికెట్ పై ఆశలు పెట్టుకున్నాడు. అదే విషయం పలుమార్లు జగన్ ను కలిసి మరీ చెప్పాడు. అలా అయితేనే వస్తాను అన్నారు ఆనం. చివరకు జగన్ ఒప్పుకున్నారని, త్వరలోనే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. ఆనం రామనారాయణరెడ్డి కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో, ఆనం రామనారాయణరెడ్డికి షాక్ ఇచ్చాడు జగన్. అనూహ్యంగా మరో నేత తెర పైకి రావటంతో, అతినికే టిక్కెట్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

jagan 06082018 2

బీజేపీ నాయకుడు నేదురు మల్లి రామ్‌కుమార్‌రెడ్డి రాజకీయ ప్రయాణంపై గందరగోళం నెలకొంది. ఆయన్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన 9గంటల వ్యవధిలోనే రామ్‌కుమార్‌ జగన్‌ను కలిసి ఆ పార్టీలో చేరడానికి లైన్‌ క్లియర్‌ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నేదురుమల్లి రామ్‌కుమార్‌ పార్టీ మారుతారనే ప్రచారం చాలారోజులుగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయనను నిలుపుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నం విఫలం కాగా, పార్టీ మారడం ఖాయం అనే విషయం తేటతెల్లమైంది. రామ్‌కుమార్‌ను పార్టీలో నిలుపుకొనే క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చింది. అయితే ఆ పార్టీలో కొనసాగడం ఇష్టంలేని రామ్‌కుమార్‌ ఆ నియామకాన్ని పట్టించుకోకుండా నేరుగా జగన్‌ శిబిరంలో చేరారు.

jagan 06082018 3

శనివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శిబిరంలో రామ్‌కుమార్‌రెడ్డి జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడారు. తను ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి సమ్మతించినట్లు తెలిసింది. ఇక త్వరలో తేదీలు ప్రకటించి తన అనుచరులతో కలిసి పార్టీలో చేరుతానని నేదురుమల్లి, జగన్‌కు తెలిపినట్లు సమాచారం. ఈ కలయికతో నేదురుమల్లి బీజేపీని వీడనున్నట్లు స్పష్టం అవుతోంది. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చేరిక క్రమంలో వెంకటగిరి వైసీపీ అభ్యర్థుల జాబితా పెరిగింది. ఆయన జగన్‌ను కలిసిన నేపథ్యంలో ఇతనే వెంకటగిరి వైసీపీ అభ్యర్థి అవుతారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. నేదురుమల్లి అనుచరులు సైతం అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆనం రామనారాయణరెడ్డిని మళ్ళీ డైలమాలో పడేసాడు జగన్.

Advertisements