వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పై కోడి కత్తితో దాడి జరిగింది జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయన పై దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన దుండగుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్‌కు టీ ఇచ్చిన శ్రీనివాస్.. ‘‘సార్ 160 సీట్లు వస్తాయా’’ అంటూ పలకరించాడు.

srinu 25102018 2

అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరారు. ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో ఏడాదికాలంగా వెయిటర్‌గా శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌ను అమలాపురం వాసిగా గుర్తించారు. దాడి ఘటనపై నిఘా వర్గాల ఆరా తీస్తున్నాయి. ప్రాథమిక విచారణ తర్వాత నిందితుడు శ్రీనివాసరావు, వైకాపా అభిమాని అని, 2014 లో వైకాపా అధికారం లోకి రాకపోవటంతో నిరుత్సాహానికి గురయ్యాడని, ఇప్పుడు హత్యా యత్నం లాంటిది జరిగితే వచ్చే సింపతీ వల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెరుగుఅయ్యే ఆలోచనతో హత్యా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.

srinu 25102018 3

జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై కేంద్ర విమానాయానశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు స్పందించారు. జగన్‌పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. ఇప్పటికే సీఐఎస్‌ఎఫ్‌ విచారణ ప్రారంభించిందని సురేశ్‌ ప్రభు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ స్పందించారు. దాడి విషయం తెలిసిన వెంటనే ఏపీ డీజీపీ ఠాకూర్‌కు ఫోన్ చేశారు. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి వెంటనే తనకు పూర్తిస్థాయి నివేదిక పంపించాలని గవర్నర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, యార్లగడ్డ వెంకట్రావులు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. డీజీపీని కలిసి జగన్‌పై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయనున్నారు.

Advertisements