దేశంలో అన్ని వ్యవస్థలు సర్వ నాశనం అయిపోతున్నాయని ఒక పక్క దేశ ప్రజలు గగ్గోలు పెడుతుంటే, ఢిల్లీ పాలకులు మాత్రం, వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీఐ, కోర్ట్ లు, సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్, గవర్నర్లు ఇలా అన్ని వ్యవస్థలు సర్వ నాశనం అయిపోయాయి. ఇంత జరుగుతున్నా, వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నం చెయ్యకపోగా, ఇంకా దిగజారుస్తున్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్ లో, గవర్నర్ ఆఫీస్ చేసిన పని చూసి అందరూ ఆశ్చర్య పోయారు. 87 మంది సభ్యులున్న అసెంబ్లీలో పీడీపీకి 28, ఎన్సీకి 15, కాంగ్రెస్ కు 12, బీజేపీకి 25 సీట్లున్నాయి. పీడీపీ, బీజేపీ కూటమి ఈ ఏడాది జూన్‌ 19న విచ్ఛిన్నమవడంతో ఆ రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్‌ కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు పై ఒక అవగాహనకు వచ్చాయి.

governer 22112018

ఈ క్రమంలో, తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ మెహబూబా ముఫ్తీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌కు లేఖ రాశారు. ఈ లేఖను గవర్నర్ ఆఫీస్ కు ఫ్యాక్స్ చేసారు. అయితే విచిత్రంగా అది గవర్నర్ ఆఫీస్ కు చేరలేదు. ఆరా తీస్తే ఫ్యాక్స్ మిషన్ పాడైందని చెప్పారు. గవర్నర్ ఆఫీస్ లో ఫ్యాక్స్ మిషన్ పని చెయ్యకపోవటం ఒక వింత. అయితే వెంటనే ఆ లేఖను గవర్నర్ పీఏ కు వాట్స్ అప్ చేసారు. ఆయన చూసినా, కొంత సమయం వరకు రెస్పాండ్ అవ్వలేదు. తరువాత అదే లేఖను మెహబూబా ముఫ్తీ ట్విట్టర్ లో పోస్ట్ చేసి, 'గవర్నర్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించానని.. కానీ ఆయన అందుబాటులో లేరని పేర్కొన్నారు. ‘(ట్విటర్‌లోనైనా) నా లేఖను మీరు తప్పక చూసే ఉంటారనుకుంటున్నాను’ అంటూ గవర్నర్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు.

governer 22112018

అయితే కొద్ది సేపటికే, గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా.. అసెంబ్లీని రద్దు చేస్తూ బుధవారం రాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ దేశంలో వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. మేము ప్రభుత్వం ఏర్పాటు చెయ్యకపోతే, ఇంకా ఎవరూ చెయ్యకూడదు అని, బీజేపీ ఇలా ఆడించింది. ‘‘ఈ సాంకేతిక యుగంలో గవర్నర్‌ నివాసంలోని ఫ్యాక్స్‌ మెషీన్‌ మా ఫ్యాక్స్‌ను అందుకోలేకపోవడం.. అదే ఫ్యాక్స్‌ మెషీన్‌ అసెంబ్లీ రద్దు ఉత్తర్వులను వెలువరించడం మాత్రం విచిత్రమే’’ అని మెహబూబా ముఫ్తీ విమర్శించారు.

Advertisements