జనసేన పార్టీ సడన్ గా ఆక్టివ్ అయ్యింది... దాదాపు నెల రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న జనసేన పార్టీ, ఒకేసారి ఆక్టివ్ అయ్యి, అనూహ్య పరిణామంతో అందరినీ అవాక్కయ్యేలా చేసింది... జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్యతో పాటు ఇతర నేతలు ముద్రగడతో, తూర్పు గోదావ‌రి జిల్లాలో ఆయన సొంత గ్రామం కిర్లం పూడిలో భేటీ అయ్యారు.... పార్టీని బ‌ల‌ప‌ర్చుకోవాల‌ని ప్రణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో, ఈ పరిణామం జరిగినట్టు తెలుస్తుంది... దాదాపుగా ఐదు గంటల పాటు జనసేన కార్యకర్తలు ముద్రగడ పద్మనాభం తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ..

janasena 19012018 2

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో జ‌న‌సేన బృందం ఏయే అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతోందో తెలియాల్సి ఉంది. అయితే పవన్ చెప్తున్న వ్యాఖ్యలకు, జనసేన పార్టీ చేస్తున్న పనులకు పొంతన లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... ఒక పక్క కుల రాజకీయాలకు నేను వ్యతిరేకం అంటూ, పవన్ మళ్ళీ కుల నాయకుడుతో భీటీ అవ్వటంతో, పవన్ కూడా అన్ని రాజకీయ పార్టీలు లాగే అనే అభిప్రాయం కలుగుతుంది అని అంటున్నారు... పవన్ తన పార్టీ సిద్ధాంతం అని ట్వీట్ చేస్తూ, మొదట చెప్పిన మాట "కులాలను కలిపే ఆలోచన విధానం" అని...

janasena 19012018 3

మరి అలాంటింది, ఈ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం అయిన, ముద్రగడతో సంప్రదింపులు జరపటం, జనసేన సిద్ధాంతానికి వ్యతిరేకం అనే అభిప్రాయం వస్తుంది... ఏది ఏమైనా, ఇది ఒక అనూహ్య పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు... ఒక పక్క ముద్రగడ, జగన్ మనిషి అనే అభిప్రాయం ఉండటం, మరో పక్క పవన్, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం... ఈ పరిణామాల్లో, జనసేన వేసిన అడుగు, అంచనాలకు అందటం లేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు...

Advertisements