ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేత, రఘురామకృష్ణం రాజు. ఆయన ఎంపీ అయిన దగ్గర నుంచి, రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా, తన అభిప్రాయాలు కుండబద్దలు కొడుతున్నారు. తాను ఎంపీగా ప్రమాణం చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకుంటూ, ప్రజల కోసమే పని చేస్తానని, ప్రజలకు ఇబ్బంది జరిగితే అది చెప్పాల్సిన బాధ్యత తన పై ఉందని చెప్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులు పై, బహిరంగంగా ఎత్తి చూపటంతో, ఆ పార్టీకి చెందిన నేత, జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి, రఘురామకృష్ణంరాజుకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అయితే దీని పై గత నాలుగు రోజులుగా రఘురామరాజు తన అభిప్రాయాలని చెప్తూ వచ్చారు. ఈ రోజు తాను వైసిపీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు రిప్లై ఇవ్వటమా, లేక జగన్ మోహన్ రెడ్డికి నేరుగా లేఖ రాయటమా, ఏదో ఒకటి చేస్తానని, ఈ రోజు 12 గంటల లోపు వారికి రిప్లై ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన ఏమి చేస్తారా అని అందరూ టెన్షన్ గా ఉన్న సమయంలో, ప్రాముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఇవన్నీ చూస్తుంటే, రఘురామరాజు ఏదో భారీ ప్లాన్ తోనే ఉన్నారని తెలుస్తుంది.

జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేస్తూ, "Will Raghu Raju’s arrow Bow and arrow hit the bulls eye ???? today !!! Hold you breath !!!" అంటూ ట్వీట్ చేసారు. రఘురామరాజు ఈ రోజు కుంభస్థలాన్ని కొడతారా ? ఊపిరి బిగబట్టండి అంటూ ట్వీట్ చేసారు. సహజంగా జంధ్యాల రవి శంకర్ ఏదో విషయం ఉంటే తప్ప హైప్ చెయ్యరు. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ విషయం, నిమ్మగడ్డ విషయం, అమరావతి విషయం ఇలా అనేక విషయాల్లో, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రఘురామకృష్ణం రాజు విషయంలో కూడా ఆయన ఏమైనా న్యాయ సలహాలు ఇచ్చారా ? అంటే, ఈ ట్వీట్ చూస్తే నిజమే అనిపిస్తుంది. రఘురామరాజు లేవనెత్తిన అంశాలు, ఏకంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదం అనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఆ విషయంలో, ఏదైనా చట్టం బయటకు తీసి, ఇరికించబోతున్నారా ? ఏది చేసినా జగన్ ని ఇబ్బంది పెట్టె వ్యూహమే కాని, పార్టీ రద్దు వరుకే వెళ్ళే అవకాశం ఉండదు అనే విశ్లేషణ కూడా వస్తుంది. చూద్దాం ఏమి చేస్తారో ?

Advertisements