‘నేను ముఖ్యమంత్రినో, లేక మంత్రినో తెలియకుండానే పవన్‌ కళ్యాణ్‌ నన్ను ముఖ్యమంత్రిగా సంబోధించి మాట్లాడు తున్నారని.. అవగాహన లోపమా, లేక ఎద్దేవా చేయ డానికా..అంటూ ఎక్సైజ్‌ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ సూటిగా ప్రశ్నించారు. కొవ్వూరు బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ముగిసిన వెంటనే ఆయన విమర్శలు, ఆరోపణలపై మంత్రి జవహర్‌ బుధవారం సాయంత్రం నేరుగా స్పందించారు. విలేకరులతో మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ అర్థం పర్దం లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరి హోదా ఏపాటిదో తెలియని అమాయకత్వం అనుకోవాలా.. లేక కావాలని పలచన చేసే విధంగా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.

pk 1102018 2

కొవ్వూరులో డిగ్రీ కాలేజీ లేదంటూ పవన్‌ చేసిన విమర్శలను నేరుగా తిప్పికొట్టారు. ఇరవై సంవత్సరాల క్రితమే ఏబీఎన్‌ డిగ్రీ కాలేజీ ఉండగా, కొవ్వూరుకు అతి సమీపాన ఉన్న రాజ మహేంద్రవరం లోను డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, త్వరలోనే మరో డిగ్రీ కాలేజీ అదనంగా కొవ్వూరుకు వస్తుందని మంత్రి జవహర్‌ చెప్పారు. పవన్‌ సీఎం చంద్రబాబును, నారా లోకేష్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, అంతేతప్ప తెలుగుదేశం పనితీరును పరిగణనలోకి తీసుకోవడంలేదని తప్పుపట్టారు.

pk 1102018 3

తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలోనూ పవన్‌ ఇష్టాను సారంగా మాట్లాడితే బహిరంగ లేఖ రాసామని, దీనిపై పవన్‌కళ్యాణ్‌ బదులు ఇవ్వలేకపోయారని జడ్పీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు అన్నారు. కేవలం బీజేపీకి, జగన్‌కు అనుకూలంగా మారిన పవన్‌ నేరుగా తెలు గుదేశంపై విరుచుకుపడుతున్నారని స్పష్టమవు తుందని చెప్పారు. ‘ఎక్కడో కాదు... తెలుగుదేశం స్వయంగా కవాతుకు దిగితే కొవ్వూరు గోదావరి బ్రిడ్జిపై నాలుగున్నర కిలోమీటర్ల మేర జనంతో నిండిపోతుంది. అదికూడా మంత్రి జవహర్‌ నాయకత్వాన.. కొవ్వూరు వాసులతోనే’ అని బాపిరాజు సవాల్‌ విసిరారు.

Advertisements