వైకాపా అధినేత జగన్‌కు తన తాత రాజారెడ్డి లక్షణాలే వచ్చాయని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎవరి మాట వినేవారుకాదని, ఆయనకు అన్నీ తన తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి ద్వారా రాయబారం పంపి తనను వైసీపీలోకి ఆహ్వానించారని, కానీ తనకు జగన్ దగ్గర ఊడిగం చేయడం నచ్చక వెళ్లలేదని జేసీ అన్నారు. టికెట్ ఇస్తాం.. వైసీపీలోకి రావాలని జగన్‌ కోరారని, పార్టీలోకి వస్తే ఎన్ని డబ్బులు ఇస్తావని విజయసాయిరెడ్డి అడిగారని.. తాను ఎందుకు మీకు కప్పం చెల్లించాలన్నానని ఎంపీ జేసీ ప్రశ్నించానని తెలిపారు.

jc diwkar 29052018 2

తనతో పెట్టుకుంటే జగన్‌ చరిత్ర మొత్తం బయటపెడతానంటూ.. 40 ఏళ్ల చరిత్రను జేసీ చెప్పుకొచ్చారు. జగన్‌లో రాజారెడ్డి క్రూరత్వం ఉందని ఆయన అన్నారు. స్కెచ్‌ వైఎస్‌ వేసేవారని, రాజారెడ్ది అమలు చేసేవారని జేసీ తెలిపారు. వైఎస్‌ను మంత్రిని చేసేందుకు రాజారెడ్డి చేయని పనులు లేవని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో జగన్‌ దగ్గర రూ. వెయ్యి కోట్ల హార్డ్‌ క్యాష్‌ ఉందని జేసీ పేర్కొన్నారు. ఎప్పుడూ చంపాలని, కొయ్యాలి, నరకాలని మాట్లాడతారని, వాళ్లు చేసిన పనుల వల్ల రెడ్లపై ప్రజల్లో అసహనం పెరిగిందని జేసీ వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న..అనంతపురం జిల్లా ఇప్పుడు కోనసీమగా మారిందని జేసీ సంతోషం వ్యక్తం చేశారు. కియా వచ్చాక అనంత జిల్లా రూపురేఖలు మారిపోయాయని, ఎవరికైనా అనుమానాలు ఉంటే అనంత జిల్లాకు వచ్చి చూడండని జేసీ ఆహ్వానించారు.

jc diwkar 29052018 3

బ్రహ్మసముద్రం ప్రాజెక్టు పూర్తయితే అనంత కోనసీమను మించిపోతుందని, అనంతపురంలో రైతులు ఎకరాకు లక్ష రూపాయిలు సంపాదిస్తున్నారని దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి.. ఏపీ సౌభ్యాగ్యంగా ఉండాలని, రాష్ట్రంలో యాచకులు ఉండొద్దని చంద్రబాబు ఆశపడతారని జేసీ పేర్కొన్నారు. జగన్‌ వస్తే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉండదన్నారు. చంద్రబాబు పక్కన ఎవరు ఉన్నది... జగన్‌ పక్కన ఎవరు ఉన్నది ఒక్కసారి చూడాలని అన్నారు. జగన్‌ పక్కన పీకలు కోసే మంగళి కృష్ణ లాంటి వారు ఉన్నారని, చంద్రబాబు పక్కన ఉన్నవారు ఆయన మాట వింటారని, జగన్‌ పక్కన ఉన్నవారు ఆయన మాట వినరని జేసీ వ్యాఖ్యానించారు.

Advertisements