‘నేను మాత్ర‌మే బతకాలి.. ఇంకెవరూ బతకకూడదు’ అనేది ప్రధాని న‌రేంద్ర‌మోదీ భావజాలమని, తనతో పాటు పది మంది బతకాలనే మనస్తత్వం సీఎం చంద్రబాబు నాయుడుదని తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు శ‌నివారం విజయవాడ వచ్చిన ఆయన.. కేశినేని భ‌వ‌న్ వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. ఈ స‌దంర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, మోదీపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ భస్మాసురుడు లాంటి వాడని, భస్మాసురుడు ఎలాగైతే తన చేత్తో తానే భస్మమయ్యాడో ఆయన కూడా తన మూడో కంటితో తానే బూడిదవుతాడని ఎద్దేవా చేశారు.

diwakar 07102018 2

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జరుగుతున్న ఐటీ దాడులకు ఎవరూ భయపడటం లేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను దివాకర్‌రెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి భాష వాడటం మంచిది కాదని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదు. కోపం, రాజకీయ శత్రుత్వం ఉండొచ్చుగానీ... ఆ స్థాయిలో ఉన్నవారు అలాంటి భాష మాట్లాడకూడదు. చంద్రబాబుకి ఎంత బాధ కలిగిందో నాకుతెలియదు గానీ, నేనయితే నాలుగంటించే వాడిని. చంద్రబాబుకి, కేసీఆర్‌కి అదే తేడా. కేసీఆర్‌ మూడో కన్ను తెరిస్తే భస్మాసురుడిలా ఆయనే భస్మమై పోతాడన్నారు.

diwakar 07102018 3

నాలుగేళ్ల పాలనలో తెలంగాణకు చేసింది చెప్పుకోలేకే తెలంగాణ ముఖయమంత్రి కేసీఆర్‌ ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. హైదరాబాద్‌ ఏమైనా ఆయన ఫాం హౌజ్‌ అనుకుంటున్నారా అని మండిపడ్డారు. శనివారం ఉండవల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కేసీఆర్‌ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. దీనిపై చర్చించేందుకు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని తెలంగాణ ముఖయమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న చంద్రబాబును తిట్టడానికి ఆయనకు నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిట్టడానికి అసలు బూతులు కూడా లేవని అన్నారు. ప్రధాని మోదీ ఓ బండరాయని, అనుబంధాల విలువ తెలియదని, ఆయన పాలనలో అదే కనిపిస్తోందని విమర్శించారు.

Advertisements