కుండబద్దలు కొట్టేసి మాట్లాడే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి, ఈ సారి కొంత మంది సొంత పార్టీ నేతలకే ఎర్త్ పెట్టారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆయనే ఎంతో కష్టపడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని అన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేల్లో 35-40 శాతం మంది పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారిని కనుక మార్చితే మళ్లీ చంద్రబాబు గెలుపును దేవుడు కూడా ఆపలేరని తేల్చిచెప్పారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజలకు చంద్రబాబుపై వ్య తిరేకత లేదు. మా జాతి చరిత్ర బాగోలేదు.. మా జాతి అంటే.. ఎమ్మెల్యేలు.. ఎంపీలం. బాగుండేవాళ్లను తెచ్చిపెట్టుకుంటే బాబే మళ్లీ సీఎం. నేను ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే గురించీ అట్లా, ఇట్లా అని ఆ యనకు చెప్పలేదు’ అని వ్యాఖ్యానించారు.

jc 23102018 2

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, వైసీసీ అధ్యక్షుడు జగన్‌ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా వ్యక్తిగతంగా గెలుస్తారని, కానీ వారు నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారని చెప్పడం అబద్ధమే అవుతుందని అన్నారు. జగన్‌, పవన్‌ భిన్న ధ్రువాలని, కలిసి పని చేయడం కష్టమని చెప్పారు. ‘‘జగన్‌ ముఖ్యమంత్రి అయితే డీజీపీని పిలిచి, ముందువెళ్లి జేసీ దివాకరరెడ్డిని అరెస్ట్‌ చేసి వచ్చి మాట్లాడు అంటారు.. జేసీపై కేసులేం లేవు కదా?.. అని డీజీపీ అంటే గంజాయి కేసు పెట్టయినా అరెస్టు చేయండని జగన్‌ చెబుతారు, తనకు ఎవరిపై కోపం ఉంటే వారందరినీ ఇలాగే అరెస్టు చేయిస్తారు, మోదీలాగే జగన్‌దీ ఫ్యాక్షన్‌ మనస్తత్వమే’’అని జేసీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ దాడుల విషయంలో ప్రధాని మోదీ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని జేసీ ఆరోపించారు. మోదీ తానొక్కడే బతకాలనుకుంటారని.. చం ద్రబాబు అందరూ బతకాలని కోరుకుంటారని అన్నారు.

jc 23102018 3

ప్రధాని, జగన్‌ది ఒకటే మనస్తత్వమని, ఇద్దరూ ఫ్యాక్షనిస్టుల్లా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా దెబ్బతింటే నేటి వరకూ ప్రధాని ఆ ఊసే ఎత్తక పోవడం, గుంటూరు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కనీసం బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం వెళ్లకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు పై కక్షతోనే రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ప్రధాని వివక్ష చూపుతున్నారన్నారు. రాష్ట్రంలో ఐటీ దాడులు మరిన్ని జరుగుతాయన్నారు. జగన్‌ సీఎం అయితే తొలుత అరెస్టు చేసేది తననేనని చె ప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుక్కి టీడీపీ టికెట్‌ ఇవ్వాలని అడుగుతానని, నిర్ణయం చంద్రబాబు ఇ ష్టమన్నారు. బాబా ప్రభోదానంద మోసగాడని కలెక్టర్‌ నివేదిక ఇచ్చారని... దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో డీజీపీని అడగనున్నట్లు తెలిపారు.

Advertisements