సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ... ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు.... చాలా మందికి ఈయన ఓక రోల్ మోడల్... ఈయన రాష్ట్రాన్ని రక్షించిన సంరక్షుకిడిగా పేరు తెచ్చుకున్నారు... కాని కొంత మంది డెకైట్, 420 బ్యాచ్ కి, ఈయనంటే హడల్... ఈయన పేరు చెప్తే చాలు, నిద్ర కూడా పట్టాదు... సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కుంభకోణం, ఓబుళాపురం మైనింగ్‌ కుంభకోణం, జగన్‌ అక్రమ ఆస్తుల కేసు, ఈ కేసులు అన్నిటినీ సమర్ధవంతంగా దర్యాప్తు చేసి, అందరినీ జైలుకి పంపించిన హీరో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ...

jd 310322018

అయితే గత కొన్ని రోజులుగా జేడీ లక్ష్మీనారాయణ, జనసేన పార్టీలో చేరుతున్నారని, పవన్ ఆధ్వర్యంలో పని చేస్తారంటూ, సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు... కాని, ఇది అవాస్తవం అని జేడీ లక్ష్మీనారాయణ సన్నిహితులు ఇప్పటికే చెప్పారు... జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి, పవన్ కింద ఎలా పని చేస్తారనుకుంటున్నారు అంటూ వారు స్పందించారు... అయినా జనసేన వర్గాలు మాత్రం, ఆయన మా పార్టీలో చేరతారు అనే ప్రచారం ఆప లేదు... పవన్ కళ్యాణ్ కూడా, ఒక ప్రెస్ మీట్ లో, జేడీ లక్ష్మీనారాయణ వస్తే ఆయన్ను ఆహ్వానిస్తాను అని చెప్పటంతో, ఈ ఊహాగానాలు ఇంకా ఎక్కువ అయ్యాయి...

jd 310322018

అయితే ఈ విషయం పై స్వయంగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. తనపై వస్తున్న వార్తలన్నీ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నది వాస్తవమేనన్నారు. అయితే ఆ దరఖాస్తు మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. ప్రభుత్వ ఆమోదించాక భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisements