కడప నుంచి చెన్నైకి విమానం మొదటిసారిగా గాల్లోకి ఎగిరింది. టర్బో మేఘా అయిర్ వేస్ కు చెందిన, ట్రూజెట్‌ సర్వీస్ మొదటిసారిగా, కడప నుంచి చెన్నైకు నడిపింది... శుక్రవారం కడప విమానాశ్రయం డైరెక్టర్‌ పి.శివప్రసాద్‌రెడ్డి విమాన ప్రయాణికులకు టిక్కెట్లు అందజేశారు... విమాన సామర్థ్యం 72 మంది ప్రయాణికులు కాగా 68 మంది ప్రయాణికులు తొలిరోజు చెన్నైకి టికెట్‌ బుక్‌ చేసుకున్నారని తెలిపారు. ట్రూజెట్‌ విమానం ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుతం చెన్నైకు నడిచే ట్రూజెట్‌ విమానం మైసూరు వరకు వెళుతుందని తెలిపారు.

kadapa 19112017 2

మైసూరు నుంచి చెన్నైకు అక్కడి నుంచి కడప వస్తుందన్నారు. కడప ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. త్వరలోనే విజయవాడకు కూడా విమానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. టర్బో మేఘా అయిర్ వేస్ కు చెందిన, ట్రూజెట్‌, కడప నుంచి చెన్నై కు, టికెట్ ధర అన్నీ కలిపి రూ.699 గా ఉంది... అదే రోజు, ట్రూ జెట్, నాందేడ్ ముంబాయి మధ్య కూడా అదే రోజు విమాన సర్వీస్ ను ప్రరంభించిని.. దీంతో మధ్య, దక్షిణ భారత దేశంలో 12 గమ్య స్థానాలకు, ట్రూజెట్‌ సర్వీస్ లు నడుపుతుంది...

kadapa 19112017 3

త్వరలోనే కడప నుంచి, విజయవాడకు కూడా విమానాన్ని అందుబాటులోకి తెస్తామని ట్రూ జెట్ తెలిపింది. ఈ సర్వీస్ ప్రారంభంలో ఎస్పీఎఫ్‌ ఇన్‌ఛార్జి అశోక్‌రెడ్డి, విమానాశ్రయం టెర్మినల్‌ మేనేజరు కేపీ.ప్రకాశన్‌, కడప ట్రూజెట్ మేనేజరు భవ్యన్‌కుమార్‌ తదితరులు పాల్నొన్నారు. మొదటి సారి, కడప నుంచి చెన్నై వెళ్తున్న కడప ప్రజలు సంతోషించారు... అలాగే, కడప నుంచి విమానాశ్రయానికి రావాలంటే ఇబ్బందిగా ఉందని, కడప టౌన్‌ నుంచి ఆటోలుగాని, సిటీ బస్సులుగాని విమానాశ్రయానికి లేవని, అధికారులు గమనించి టౌన్‌ బస్సులు నడిపితే బాగుంటుందని ప్రయాణికులు చెప్పారు.

Advertisements