దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కర్ణాట ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానలకు ఇవాళ ఉదయం 7గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సాయంత్రం 6.30 గంటల తర్వాత వివిధ సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను పరిశీలిస్తే కర్ణాటకలో మరోసారి కాంగ్రెస్‌పార్టీ అధికారం కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాటుడే: కాంగ్రెస్‌ 106 నుంచి 108 స్థానాల్లో, భాజపా 80-93 స్థానాల్లో జేడీఎస్‌ 20-30 స్థానాల్లో, ఇతరులు 1-4 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఇండియాటుడే తెలిపింది.

exit polls 12052018 2

టైమ్స్‌నౌ-వీఎంఆర్‌: కాంగ్రెస్‌ 90 నుంచి 103 స్థానాల్లో, భాజపా 80-93, జేడీఎస్‌ 31-39, ఇతరులు 2-4 స్థానాల్లో విజయం సాధించ వచ్చని టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ వెల్లడించింది. ఈ పోల్స్‌లో దాదాపు 7000 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించినట్లు ఆ ఛానల్ తెలిపింది. దాదాపు 600 పోలింగ్ బూత్‌లలో ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. రిపబ్లిక్‌ టీవీ- జన్‌కీ బాత్‌: కాంగ్రెస్‌ 73-82 స్థానాల్లో, భాజపా 95-114, జేడీఎస్‌ 32-43, ఇతరులు 2-3 స్థానాల్లో విజయం సాధించే అవకాశముంది. ఆజ్‌తక్ ఛానల్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడబోతోందని తెలుస్తోంది.

exit polls 12052018 3

ఇండియా టుడే-యాక్సిస్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీకి 79-92, కాంగ్రెస్‌కు 106-118, జేడీఎస్‌కి 22-30 స్థానాలు లభిస్తాయని ప్రకటించింది. సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని తెలుస్తోంది. బీజేపీకి 97-109, కాంగ్రెస్‌కు 87-99, జేడీఎస్‌కి 21-30, ఇతరులకు 1-8 స్థానాలు లభిస్తాయని సీ-ఓటర్ సర్వే చెప్తోంది. ఈ సర్వే శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగినట్లు పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకు 64 శాతం పోలింగ్‌ నమోదయిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలోని రామనగర్‌ జిల్లాలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ నమోదుకాగా, బెంగళూరు పట్టణంలో అత్యల్పంగా 44 శాతం నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Advertisements