టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ భేటీలో ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. ఈనెల చివరివారం లేదా వచ్చే నెల మొదటివారంలో అమరావతికి కేసీఆర్‌ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ పర్యటనలో వైసీపీని ఫెడరల్‌ ఫ్రెంట్‌లోకి కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. లోటస్‌పాండ్‌లో జగన్, కేటీఆర్ నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రజాసంకల్పయాత్ర వివరాలను కేటీఆర్‌ బృందానికి జగన్‌ వివరించారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌ కేంద్రానికి లేఖరాస్తే బాగుంటుందని జగన్‌ కోరారు. అమరావతిలో భేటీ తర్వాత కేసీఆర్‌ లేఖపై నిర్ణయాన్ని ప్రకటిస్తారని కేటీఆర్‌ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు పలుకుతూనే తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడుదామని కేటీఆర్‌ చెప్పారు.

kcr 16012019

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికలు, రాహుల్‌-చంద్రబాబు ప్రచారంపై కేటీఆర్‌ను జగన్‌ అడిగి తెలుసుకున్నట్లు వినికిడి. సమావేశంలో కేసీఆర్‌కు ఫోన్‌ చేసి జగన్‌తో కేటీఆర్‌ మాట్లాడించినట్లు సమాచారం. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం కలిసి రావాలని జగన్‌ను కేసీఆర్‌ ఆహ్వానించినట్లు వైసీపీ, టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్వయంగా అమరావతికి వచ్చి కలుస్తానని జగన్‌కు కేసీఆర్‌ చెప్పారు. అయితే ఇక్కడ ప్రజలకు అర్ధం కాని విషయం ఒకటి ఉంది. అసలు కేసీఆర్, అమరావతి వచ్చి జగన్ ను కలవటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇద్దరికీ ఇక్కడ ఇల్లు లేదు.... ఇద్దరూ అమరావతికి సంబంధం లేని వాళ్ళే... ఒకరైతే ప్రారంభానికి పిలిచినా నేను రాను చెప్పారు... మరిక్కడ ఎందుకు కలవడం...?

kcr 16012019

మరో పక్క ఈ భేటీ పై లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన నారాలోకేశ్.. టీఆర్ఎస్, వైసీపీల స్నేహబంధంపై సెటైర్లు వేశారు. ఈ రెండు పార్టీల పొత్తుతో.. ఏపీపై కుట్రలు బయటపడ్డాయన్నారు. ఢిల్లీ మోదీ, ఆంధ్రా మోదీ, తెలంగాణ మోదీలు ఒక్కటయ్యారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ముగ్గురూ కలిసి ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్‌ను తెలంగాణ మోదీగా, నరేంద్ర మోదీని ఢిల్లీ మోదీగా, జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రామోదీగా అభివర్ణించారు లోకేశ్. ఈ సందర్భంగా కేసీఆర్ గతంలో ఆంధ్రావారి గురించి చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు లోకేశ్. ’లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా వారి వారసులు. ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుంది‘ అని అవహేళన చేసిన కేసీఆర్‌తో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జతకట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisements