బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం డిల్లీ లో  ప్రారంభోత్సవం సందర్భంగా , డిల్లీ అంతటా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. అయితే అనూహ్యంగా డిల్లీ మెట్రో కార్పోరేషన్ వాళ్ళు గులాబీ పార్టీకి  షాక్  ఇచ్చారు. ఢిల్లీలో  ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను పీకి పడేసారు. అంతే కాకుండా  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర  ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ను కూడా తొలగించేసారు. మా అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేశారని ఎన్డీఎంసీ సిబ్బంది  పార్టీ నేతలని ప్రశ్నించారు . దీంతో ఒక్కసారిగా గులాబీ నేతలు ఖంగు తిన్నారు.

Advertisements