తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బెజవాడ పర్యటన రద్దు చేసుకున్నారు. షడ్యుల్ ప్రకారం, ఈ నెల 27 కాని, 28 కాని, కేసీఆర్ విజయవాడ పర్యటన ఉంటుంది అని తెలంగాణా సియం పేషీ అధికారులు, దుర్గగుడి అధికారులకి తెలియ చేశారు. పర్యటనలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించి, మొక్కు తీర్చుకుంటారని ఆంధ్రప్రదేశ్ సియం పేషీకి సమాచారం ఇచ్చారు.

అయితే, నవరాత్రులు జరుగుతున్నందున ప్రజలు భారీగా తరలి వస్తున్నారని, పర్యటన వాయిదా వేసుకుని, నవరాత్రులు అయిన తరువాత, పర్యటన ఉంటే బాగుంటుంది అని, ఆంధ్రప్రదేశ్ సియంఓ అధికారులు, తెలంగాణా సియంఓకు చెప్పటంతో, కెసిఆర్ పర్యటన వాయిదా పడింది అని చెప్తున్నారు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని ఆయన మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం తెలంగాణ దేవుళ్ల మొక్కులు తీర్చుకుంటున్నారు. దాదాపు 75 లక్షలతో తెలంగాణా ప్రభుత్వం తరుపున, కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్నారు కేసీఆర్. త్వరలోనే పర్యటన ఉంటుంది అని తెలంగాణా సియంఓ అధికారాలు చెప్తున్నారు.

Advertisements