బెజవాడలో గత మూడు సంవత్సరాల నుంచి, 72 అడుగుల భారీ మట్టి వినాయకుడిని, పర్యావరణహితంగా ప్రతిష్టిస్తూ వస్తున్నారు. ఈ భారీ వినాయకుడి విగ్రహాన్ని నిర్మించిన చోటనే నిమజ్జనం చేస్తారు. దీంతో పర్యావరణం కాపాడుతూ వస్తున్నారు.

ఇప్పుడు అదే బాటలో వచ్చే సంవత్సరం నుంచి, హైదరాబాద్, ఖైరతాబాద్‌ గణేష్ డు కూడా రెడీ అవుతున్నారు. ఖైరతాబాద్‌ ఉత్సవ సమితి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి.. హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు సుదర్శన్‌ వివరించారు.

పెద్ద విగ్రహాలు ఇలా మట్టితో తయారు చేస్తే, మిగతా వారు కూడా, మట్టి విగ్రహలకే ప్రాధన్యాత ఇస్తారని, తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు ప్రజలు.

Advertisements