రాయలసీమ పరిధిలో అనంతపురం జిల్లాలో నిర్మితమౌతున్న కియా మోటార్స్‌ సంస్థ నుంచి చిత్తూరు జిల్లా మీదుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు నాలుగు లేన్‌లతో జాతీయ రహదారిని నిర్మించే బృహత్‌ ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా, మదనపల్లె – తిరు పతి – నాయుడుపేట రోడ్డు నిర్మాణానికి అవసరమైన సర్వేలు, భూసేకరణ పనులు ఊపందుకున్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల మేరకు నిర్మితమయ్యే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించిన ఎస్టిమేట్లు త్వరలో సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గత నాలుగేండ్లుగా విస్తృతంగా కొనసాగుతున్న పారిశ్రామిక అభివృద్ది పనులలో భాగంగా కొరియా దేశానికి చెందిన కియామోటార్స్‌ పరిశ్రమ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటుకావడం ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా పేర్కొనవచ్చు.

సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు నిర్వహించిన పర్యటనలు, కియా మోటార్స్‌ యాజమాన్యంతో జరిపిన చర్చల ఫలితం గానే సాధ్యమైంది. ఆ కృషి ఫలితంగానే 2017 ఏప్రిల్‌ 20న ఆ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. అనంతపురం జిల్లా పెనుగొండ గ్రామంలోని ఎర్రమంచి గ్రామం వద్ద ప్రభుత్వం కేటాయించిన 500 ఎకరాల స్థలంలో 13 కోట్ల వ్యయంతో 10 వేల మందికి ఉపాధి లక్ష్యంగా కియామోటార్స్‌ పరిశ్రమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆ సంస్థలో తయారు చేసే మోటారు వాహనాల రవాణాకు అటు బెంగుళూరు విమానాశ్రయంతో పాటు ఇటు కృష్ణపట్నం ఓడరేవు ఉత్తమ మార్గమౌతుందని వాణిజ్య రంగ నిపుణులు సూచించారు. ఆ సూచనల కు అనుగుణంగా అనంతరపురం జిల్లాలోని కియా మోటార్స్‌ నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని జాతీయ రహదారిగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. చిత్తూరుజిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణి గుంట, సత్యవేడు మధ్య ప్రాంతాలలో అంచలంచ లుగా అభివృద్ది చెందుతున్న ఎలక్ట్రానిక్‌ హబ్‌, ఆటోమోటివ్‌ హబ్‌, ఇండస్ట్రీయల్‌ హ బ్‌లకు ఉపయోగపడే విధంగా జాతీయ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఆ క్రమంలోనే అనంతరపురం జిల్లా నుంచి చిత్తూ రులోని మదనపల్లెను కలిపే 190 కిలోమీటర్ల 42 వ నెంబరు జాతీయ రహదారి నుంచి ఉన్న రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయిం చింది. ఆ రహదారి జాతీయ రహదారిని కలిపే ప్రస్తుత రోడ్డు మార్గాన్ని నాలుగు లేన్‌లుగా విస్తరించే బృహత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లాలో నాయుడుపేట నుంచి కృష్ణపట్నం ఓడరేవు వరకు దాదాపు 40 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్లతో నిర్మించడానికి ప్రణాళిక సిద్ధమైంది. మదనపల్లె- తిరుపతి, తిరుపతి-నాయుడుపేట, నాయుడుపేట- కృష్ణపట్నం మధ్యలో మూడు ప్యాకేజిలుగా దాదాపు 200 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను చేపట్టే లక్ష్యంతో చిత్తూరు జిల్లా యంత్రాంగం నేతృత్వంలో ప్రస్తుతం సర్వేలు, భూ సేకరణ తదితర మౌళిక కార్య క్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అవకాశం ఉన్న చోట్ల భూ సేకరణ ద్వారా రోడ్ల విస్తరణ పనులు చేపట్టామని, వీలు కాని చోట్ల ప్రభుత్వ స్థలాల గుండా బైపాస్‌రోడ్లను నిర్మించడం ద్వారా సంబం ధిత అధికారి ఒకరు తెలిపారు. సర్వేలు, భూ సేకర ణలు పూర్తి అయిన తర్వాత వచ్చే సెప్టెంబర్‌ నెలలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి స ంబంధించిన అంచనాలు సిద్ధమౌతాయని కూడా ఆ అధికారి తెలిపారు.

అనధికార సమాచారం ప్రకారం దాదాపు రూ. 700 కోట్ల వ్యయంతో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కలిపేవిధంగా భవిష్యత్‌ అవసరా ల కోసం నిర్మితమయ్యే ఈ రహదారి పూర్తి అయితే ఈ మార్గంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగవడంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గి పోతుంది. మొత్తం మీద అనంతపురం, మదనపల్లె, తిరుపతి, నాయుడుపేట, కృష్ణపట్నం నడుమ నాలు గు లేన్‌లతో నిస్తరించనున్న రహదారి వెనక బడిన రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఊపందుకుంటున్న పారిశ్రామిక ప్రగతికి ఊతమివ్వ డంతో పాటు సీమజిల్లాల రవాణా వ్యవస్థకు వరప్రసాదమౌతుందనడంలో సందేహం లేదు.

Advertisements