జగన్ కోడి కత్తి గుచ్చుడు కేసు, రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ రోజు జగన్‌, ఆయన పీఏకు విశాఖ కోర్టు నోటీసులు జారీ చేసింది. దాడి ఘటన సమయంలో జగన్‌ ధరించిన చొక్కాను ఈ నెల 23లోగా దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తులో చొక్కా కీలకమని కోర్టులో దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయం పై ఇప్పటికే హైకోర్ట్ లో కూడా వాదనలు జరుగుతున్నాయి. విమానాశ్రయంలో దాడికి సంబంధించిన దర్యాప్తునకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రక్తం మరకలున్న చొక్కా ఇంత వరకూ దర్యాప్తు అధికారులకు అందజేయలేదని చెప్పారు.

court 17112018 2

అంతే కాదు, సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద వాంగ్మూలం ఇవ్వడానికీ నిరాకరించారని తెలిపారు. దాడిలో గాయపడ్డ జగన్‌ను విమానంలో ప్రయాణించేందుకు ఎలా అనుమతించారు? అలా అనుమతించే ముందు మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారా? దానిని ఎవరు జారీ చేశారు? రక్తపు మరకలు అంటిన జగన్‌ చొక్కాను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అసలు... సీఐఎ్‌సఎఫ్‌ నిబంధనలు ఏం చెబుతున్నాయి? వీవీఐపీ లాంజ్‌లో దాడి జరిగితే సీఐఎ్‌సఎఫ్‌ ఏం చేస్తోంది?... అంటూ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ కె.లక్ష్మణ్‌పై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని... సీఐఎ్‌సఎఫ్‌ నివేదిక, ఎయిర్‌పోర్టు అథార్టీ నిబంధనలు వివరించాలని ఆదేశించింది. అలాగే... సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద ఏపీ పోలీసులకు జగన్‌ వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

court 17112018 3

ఒక పక్క హై కోర్ట్ లో ఇవన్నీ జరుగుతూ ఉండగానే, ఇప్పుడు విశాఖ కోర్ట్ కూడా, దాడి ఘటన సమయంలో జగన్‌ ధరించిన చొక్కాను ఈ నెల 23లోగా దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు జగన్ ఆడుతున్న నాటకాలు బట్టబయలు కానున్నాయి. అసలు ఇప్పటి వరకు ఆ చొక్కా, దర్యాప్తు అధికారులకు ఇవ్వకపోవటం వెనుక ఎదో తేడా ఉందని, అందరూ అనుకుంటున్న వేళ, కోర్ట్ కీలక ఆదేశాలు ఇవ్వటంతో, జగన్ ఏమి చేస్తారో చూడాలి. కోర్ట్ ఆదేశాలు ప్రకారం, ఆ చొక్కా దర్యాప్తు అధికారులకు ఇస్తారో, లేక ఆ చొక్కా పారేసాను, ఉతికేసాను, లేకపోతే, ఏపి పోలీసులకు ఇవ్వను, తెలంగాణా పోలీసులకు, మోడీ పోలీసులకే ఇస్తాను అని జగన్ అంటారో చూడాలి...

Advertisements