ఐక్యరాజ్య సమితి మాజీ చీఫ్ కోఫీ అన్నన్‌ మృతిపై మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు సంతాపం తెలిపారు. 2001లో తాను సీఎంగా ఉన్నప్పుడు అన్నన్ హైదరాబాద్‌ను సందర్శించిన అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయన మానవాళికి చేసిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కోఫీ అన్నన్ శనివారం దివంగతులైన విషయం తెలిసిందే. ఆయన వయసు 80 ఏళ్ళు. ఆయన స్వల్ప అస్వస్థతతో బాధపడుతూ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌‌లో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

kofi 18082018 2

2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని కోఫీ అన్నన్ సందర్శించారు. గొప్ప వ్యక్తిని, నాయకుడిని, ముందుచూపు గల వ్యక్తిని కోల్పోయామని ఐక్య రాజ్య సమితి వలసల విభాగం ట్విటర్‌ ద్వారా అన్నన్‌కు నివాళులర్పించింది. ఐరాస నుంచి తప్పుకొన్న తర్వాత కూడా కోఫీ అన్నన్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా, నెల్సన్‌ మండేలా స్థాపించిన ది ఎల్డర్స్‌ గ్రూప్‌లో సభ్యుడిగా ప్రపంచ శాంతి కోసం తన వంతు కృషి చేశారు.

Advertisements